Suicide: సాధారణంగా యువకులలో ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని గారాబంగా పెంచటం వల్ల తల్లిదండ్రులు మాట వినకుండా తయారవుతున్నారు. ముఖ్యంగా యువకులు వ్యసనాలకు అలవాటుపడి తప్పుదారి పడుతున్నారు. తల్లిదండ్రులు మందలించినప్పుడు ఆవేశానికి లోనే ఇంటి నుండి పారిపోవడం, లేదా ఆత్మహత్యకు పాల్పడటం వంటి పొరపాట్లు చేస్తుంటారు. ఇటీవల ఇటువంటి బాధాకరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన అయిలీ వెంకటేష్(19) డిగ్రీ చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం వెంకటేష్ ప్రవర్తన సరిగా లేకపోవటం వల్ల వెంకటేష్ తండ్రి మందలించాడు. యుక్తవయసులో ఉన్న పిల్లలు సహజంగా ఎక్కువ ఆవేశం కలిగి ఉంటారు. ఏ విషయమైనా లోతుగా ఆలోచించే విధంగా వారి మెదడు పరిణితి చెంది ఉండక పోవడం వల్ల ఆవేశంలో ఏమైనా చేస్తారు. వెంకటేష్ కూడా తన తండ్రి మందలించడంతో వల్ల ఇంటి నుండి పారిపోయాడు.
ఎంతసేపటికి కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది తల్లిదండ్రులు, బంధువులు కలిసి వెంకటేష్ ని వెతకటం మొదలుపెట్టారు. గూడూరు మండల కేంద్ర శివారు చంద్రుగూడెం పల్లె ప్రకృతి వనం ఉంది. బుధవారం వెంకటేష్ బంధువులు అక్కడికి వెళ్లి చూడగా అక్కడ వెంకటేష్ మృతదేహం కనిపించింది.తండ్రి మందలించడంతో వెంకటేష్ మనస్థాపానికి లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎంక్వయిరీ మొదలుపెట్టారు.