పైలట్లు పెర్ఫ్యూమ్ అస్సలు వాడరంట.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

సాధారణంగా ఎవరికైనా ఫంక్షన్‌కి, పార్టీకి లేదా ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు.. మంచి స్మెల్ రావాలంటే పెర్ఫ్యూమ్ ని చాలా మంది వాడుతుంటారు. కానీ గాల్లో వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్న విమానాన్ని నడిపే పైలట్లు మాత్రం ఒక్క బొట్టు సెంట్ కూడా వాడరని మీకు తెలుసా.. అవును ఇది వింటే కొందరికి ఆశ్చర్యమే అనిపించవచ్చు. కానీ దీనికి వెనుక ఉన్న కారణాలు తెలుసుకుంటే మీరు కూడా ఇది నిజంగానే అవసరం అనక మానరు. అసలు పైలట్స్ ఎందుకు పెర్ఫ్యూమ్ వాడరో ఈ కథనంలో తెలుసుకుందాం.

పైలట్‌గా పని చేయడం అంటే సరదా కాదు. విమానం ఎక్కిన తర్వాత ప్రతి క్షణం కఠినమైన రూల్స్, రెగ్యూలేషన్స్ మధ్యే ఉంటుంది. ఒక్క చిన్న పొరపాటు కూడా వందలాది ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతుంది. అందుకే వారు చేసే ప్రతీ పనిలో భద్రతే మొదటి ప్రాధాన్యంగా ఉంటుంది.. ఈ భద్రతా నిబంధనల్లో ఒకటి పెర్ఫ్యూమ్, డియోడరెంట్, ఆల్కహాల్ ఉన్న వస్తువులు వాడకూడదు.

పెర్ఫ్యూమ్‌లో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల అవి సులభంగా మంటలు అంటుకోవచ్చు. విమానంలో భద్రతా చర్యల్లో ఇది పెద్ద రిస్క్‌గా భావించబడుతుంది. అంతేకాకుండా, కొన్ని సెంట్ల ఘాటైన వాసన పైలట్ల దృష్టిని మరల్చే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా కలిగించవచ్చు. పైలట్‌కు కాసేపు అయినా ఏకాగ్రత తగ్గడం అంటే ప్రమాదకరమే. అందుకే పైలట్స్ పెర్ఫ్యూమ్ కి దూరంగా ఉంటారు.

అంతేకాదు మరో ముఖ్య కారణం ఏంటంటే.. శ్వాస పరీక్ష. విమానం ఎక్కే ముందు పైలట్లు, సిబ్బందికి ‘బ్రెత్‌లైజర్’ టెస్ట్ చేస్తారు. పెర్ఫ్యూమ్ లేదా ఆల్కహాల్ ఉన్న మౌత్‌వాష్, టూత్‌పేస్ట్, హ్యాండ్ శానిటైజర్ వాడితే, ఆవిరి శ్వాసలోకి వెళ్లి తప్పు రీడింగ్ ఇవ్వొచ్చు. ఇది టెస్ట్‌లో తప్పుడు పాజిటివ్ ఫలితానికి దారితీసే అవకాశం ఉంది. అలాగే, కొందరు ప్రయాణికులకు పెర్ఫ్యూమ్ వాసనతో అలర్జీ, దగ్గు, తుమ్ములు వచ్చే అవకాశం ఉంది. అందరి సౌకర్యం కోసం పైలట్లు, సిబ్బంది ఈ వస్తువులన్నింటినీ దూరంగా ఉంచుతారు. కాబట్టి, పైలట్ల ‘నో పెర్ఫ్యూమ్’ రూల్ కేవలం ఒక అలవాటు కాదు, గాల్లో భద్రతకు అవసరమైన కీలక నిబంధన.