కేసిఆర్ కు కోదండరాం పార్టీ సంధించిన ప్రశ్నలివే

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ జన సమితి కి మాటల యుద్ధం రోజు రోజుకూ తీవ్రమవుతున్నది. జన సమితి పార్టీ ఏర్పాటైనా ఇప్పటి వరకు ఆ పార్టీని అధికార పార్టీ లెక్కలోకి తీసుకోవడంలేదు. తమ శత్రువు కాంగ్రెస్సే అన్న ధోరణిలో టిఆర్ఎస్ కదులుతున్నది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ లో నీటి విడుదల కోసం ఆందోళన చేసి అరెస్టయిన రైతులను పరామర్శించేందుకు జయశంకర్ సార్ జయంతి రోజు కోదండరాం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అయితే ఆయనను నిజామాబాద్ లో కాలు పెట్టకుండా మధ్యలోనే అరెస్టు చేసి బలవంతంగా గుంజుకుపోయి వ్యాను ఎక్కించి హైదరాబాద్ లో దింపిర్రు. బాధలో ఉన్నవారిని పరామర్శించడం కూడా నేరమేనా అని తెలంగాణ జన సమితి పోలీసుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే తెలంగాణ జన సమితి అధికార టిఆర్ఎస్ పార్టీకి కీలకమైన ప్రశ్నలు సంధించింది. టిఆర్ఎస్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ సవాల్ చేసింది. ఆ ప్రశ్నలు కింద ఉన్నాయి చదవండి.

ఈ నిరంకుశ పాలనలో రైతులను పరామర్శించడం కూడా నేరమేనా?

తెలంగాణని నరనరాన వ్యతిరేకించిన సీమాంధ్ర రాజకీయ నాయకులను మీరు రాసుకు పూసుకు తిరగవచ్చా?

లంగలు, దొంగలు అని నాడు మీరు తిట్టిన సినిమా వాళ్ళతో నేడు వేదికలు పంచుకోవచ్చు. సెల్ఫీ లు దిగవచ్చా?

లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులే ఆంధ్ర లో పుట్టిన వాళ్లంతా తెలంగాణ వ్యతిరేకులే అని ఆప్పుడు తెలంగాణ వాదులను రెచ్చగొట్టి నేడు ఇక్కడ ఉన్న సెటిలర్ ల ఓట్ల కోసం నానా గడ్డి కరవవచ్చా?

తప్పుడు వార్తలతో యువత ని నిరాశలోకి నెట్టి వాళ్ళ ఆత్మహత్యలకు కారణం అయిన సీమాంద్ర మీడియా ని కిలోమీటర్ లోతున బొందవెట్టాలి అని ఉద్యమం లో అని, మీ మాట వినడంలేదు అని వాటిని బ్యాన్ చేయవచ్చు. నేడు అదే మీడియా కి అప్పనంగా భూములు ఇవ్వావచ్చా?

తెలంగాణ వ్యతిరేకుల పెళ్ళిలకు ప్రత్యేక విమానంలో పోవచ్చా?

విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను జలగల్లా పిక్కు తిన్న సీమాంధ్ర కార్పొరేట్ విద్యాసంస్థల్ని కూకటివేల్లాతో సహా సీమాంధ్ర కి తరలి కొట్టాలని నాడు చెప్పవచ్చు. వచ్చిన తెలంగాణ లో అదే విద్యా సంస్థల్ని మీ బినామిలతో నడుపుకోవచ్చా?

అదే కార్పొరేట్ కళాశాలల్లో చదివే పిల్లలు తెలంగాణ వచ్చాక కూడా ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించి కారణం తెలుసుకునే సమయం లేని మీకు అదే విద్య సంస్థల వారసులు తాగి ఆక్సిడెంట్ లో ఛస్తే మాత్రం పనులన్నీ వదులోకొని దగ్గరుండి వాళ్ళ శవాలను సాదరంగా పంపవచ్చా

ఆర్టీసీ సంస్థ మనుగడని ప్రశ్నర్ధకం చేసి విచ్చల విడిగా పర్మిట్ లు లేని ప్రైవేట్ బస్ మాఫియా లను అడ్డుకుంటాం ఆర్టీసీని కాపాడుకుంటాం అని బొంకి నేడు కార్మికుల భుజం పైన గన్ పెట్టి కాల్చుతూ తెలంగాణ లో ఆర్టీసి ని మూసివేత దిక్కుగా తోసేయవచ్చా?

కానీ నిజాయతీ, నిబద్ధత సింప్లిసిటీ కలిసి తెలంగాణ ఉద్యమాన్ని ఊరూరికి తీసుకెళ్లిన ప్రో.కోదండరాం కు మాత్రం కలుస్తా అంటే అపాయింట్మెంట్ ఇవ్వరు. ఆయన ఎక్కడికి వెళ్లినా అడ్డుకుంటారు.

కోదండరాం ఏదన్నా సభ పెడతాం అంటే మీ లాగులు తడుస్తాయి. కోర్టులకు వెళ్లి మరీ పర్మిషన్ లు తెచ్చుకోవాలి.

ఆయన ఏదన్నా సమస్య పై స్పందిస్తే మీ గుండెలు అదురుతాయి. ఎందుకంటే తెలంగాణ ని వ్యతిరేకించిన సీమాంధ్ర తొత్తులుగా పనిచేసిన వాళ్ళు అధికారం కోసం బెల్లం చుట్టూ మీ చుట్టూరా తిరుగుతున్నారని నిజాయితీ కలిగిన ఆయన ఏదన్నా అంశం పై సమగ్రంగా చేసే విశ్లేషణ మీ అధికార పీఠాన్ని కదిలిస్తుందేమో అని భయం.

అందుకే ఆయన ఎక్కడకు వెళ్లిన ఏమి చేసినా మీకు భయం పట్టుకుంటుంది.

ఉద్యమము చేయడానికి ఒక ప్రధాన కారణం అయిన నీళ్ల విడుదల కై ఆందోళన చేస్తున్న శ్రీరామ్ సాగర్ ఆయకట్టు రైతులకు మద్దతు ఇవ్వడానికి , వారి ఆందోళనకి మద్దతు ఇచ్చిన వారిపై పెట్టిన అక్రమ కేసులను ఖండించి వారికి సంఘిభావం తెలపడానికి నిజామాబాద్ వెళ్తున్న కోదండరాం ను బిక్నుర్ వద్ద అక్రమంగా అరెస్ట్ చేయడం అంటేనే ఆయన అంటే మీరు ఎంత బయపడుతున్నారో తెలుస్తుంది.

అసలు ఆర్మూర్ డివిజన్ లో 144 సెక్షన్ పెడితే ఆయన్ని మెదక్ జిల్లా బార్డర్ లోనే ఎందుకు అరెస్ట్ చేశారు.

ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం త్యాగాల పునాదుల మీద కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో నీళ్లు, నియామకాలు ఇవ్వమని అడగడమే పాపమా ??

కోదండరాం గారి పట్ల మీరు ఎంత అనగదొక్కే వైఖరి ప్రదర్శిస్తే ప్రజల్లో, నిజమైన ఉద్యమకారుల్లో పలచన అవుతారు.

ఈ బీటీ బ్యాచ్ బాపతూగాళ్లు మీరు పదవిలోంచి పోగానే ఇంకో బకారా ని చూసుకుంటారు. వాళ్లకు కావాల్సింది అధికారం. విలువలతో వాళ్ళకి ఏమి పని.

అప్పుడు మీ బ్రతుకు రెండికి చెడ్డ రెవడి ల అవుతుంది.

జై తెలంగాణ