కేసీఆర్, జగన్ రాజకీయాలకు కలుషితం చేశారా.. అసలేం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అధికారంలో ఉండగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉన్నారనే సంగతి తెలిసిందే. అయితే ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రావడానికి ఒక విధంగా వాళ్లు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కారణమని చెప్పవచ్చు. కేసీఆర్, జగన్ రాజకీయాలను కలుషితం చేశారని ఉచితాలు, సంక్షేమ పథకాలకు లక్ష్మణ రేఖ ఉండాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అటు కేసీఆర్ ఇటు సీఎం జగన్ ఓట్ల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశారని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా కేసీఆర్, జగన్ అడుగులు వేస్తుండటం గమనార్హం. మరోవైపు కేసీఆర్ ఆస్తుల గురించి కూడా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆస్తులు ఎంత అని ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 80,000 కోట్ల రూపాయలు ఖర్చైందని అయితే అంత ఖర్చు చేసినా ఎవరికి లాభం కలిగిందని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణ, ఏపీ రాజకీయ నేతలు వాడుతున్న భాష సైతం అభ్యంతరంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్, కేసీఆర్ ఈ విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో మార్పు తెస్తుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. మాకు అధికార పార్టీలతో మాత్రమే పోటీ అని బీజేపీ నేతలు చెబుతున్నారు. మోదీ, అమిత్ షా అండతోనే ఎన్నికలకు వెళతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు నిజంగానే రాష్ట్ర రాజకీయాలలో విప్లవాత్మక మార్పులకు కారణమవుతాయేమో చూడాల్సి ఉంది.