అక్రమంగా బంగారం తరలిస్తూ అడ్డంగా అధికారులకు దొరకిపోయిన ప్రయాణికుడు.. కోట్లు విలువ చేసే బంగారం స్మగ్లింగ్!

ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున గోల్డ్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పెద్ద ఎత్తున అధికారులకు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది ఎయిర్పోర్ట్ లో ఇలా అధికారులకు దొరికిపోయిన సంఘటనలు మనం వింటూనే ఉన్నాం. తాజాగా అనుమానాస్పదంగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్నటువంటి ఓ ప్రయాణికుడిని అధికారులు గుర్తించి తనని అదుపులోకి తీసుకోగా ఆయన వద్ద బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ క్రమంలోనే అతని వద్ద ఉన్నటువంటి గోల్డ్ చూసి కష్టమ్ అధికారులు షాక్ అయ్యారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడు అనుమానాస్పద స్థితిలో వెళ్లడంతో కష్టమ్ అధికారులు తనని ఆపి సోదాలు నిర్వహించారు.ఇలా ప్రయాణికుడి నుంచి ఏకంగా 8 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. అయితే ఇలా సీజ్ చేసిన బంగారం విలువ సుమారు నాలుగు కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.EK-524 నెంబర్‌ ఫ్లైట్‌లో దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్యాసింజర్స్‌ నుంచి 24 గోల్డ్‌ బిస్కట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటికే ఇలా దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుల నుంచి అధికారులు భారీగా గోల్డ్ సీజ్ చేశారు.ఈ క్రమంలోనే దుబాయ్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుందని గుర్తించిన అధికారులు దుబాయ్ నుంచి ఇండియాకి వస్తున్నటువంటి ప్రయాణికులపై పెద్ద ఎత్తున నిగా ఉంచారు.ఈ విధంగా ఒక ఫ్లైట్ నుంచి వచ్చినటువంటి ప్రయాణికుల నుంచి అధికారులకు 8 కోట్ల విలువ చేసే బంగారాన్ని గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం సీజ్ చేయడం ఇదే మొదటిసారి అంటూ కష్టమ్ అధికారులు తెలిపారు.