బస్సులో ప్రయాణికులపై కారం చల్లిన ప్రయాణికుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఓ ప్రయాణికుడు ఉన్నఫలంగా ఉన్మాదిలా మారి తోటి ప్రయాణికులపై కారంపొడి చల్లి తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఇలా ఉన్నఫలంగా ప్రయాణికుల కళ్ళల్లో కారం కొట్టడంతో ఆ ఘాటుకు ఏమైందో తెలియక ప్రయాణికులు ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని పోలీసులకు అందజేయడంతో పోలీసులు ఆ ఉన్మాదిని అదుపులోకి తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే…

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆయోధ్య లంకకు చెందిన ఉండాల రాంబాబు అనే యువకుడు దుబాయి వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. అయితే ఇమిగ్రేషన్ లో తన పాస్పోర్ట్ వీసా సరిగా లేనందు కారణంగా అధికారులు తనని వెనక్కి తిరిగి పంపించారు. ఈ క్రమంలోనే దుబాయ్ వెళ్లాల్సిన రాంబాబు తిరిగి సొంత గ్రామానికి ప్రయాణమయ్యారు.. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి రాజోలు వెళుతున్నటువంటి ఇంద్ర ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అయితే ఉన్నఫలంగా ఆయన దుబాయ్ కి తాను తీసుకు వెళ్లాల్సిన రెండు కిలోల కారంపొడిని తోటి ప్రయాణికులపై చల్లారు.

ఈ విధంగా ఒక్కసారిగా ప్రయాణికుల కళ్ళల్లో కారం కొట్టడంతో ఆందోళనకు గురైన అభిమానులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే దుబాయ్ వెళ్లకుండా అధికారులు తన పాస్ పోర్ట్ రిజెక్ట్ చేయడంతోనే ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు, నిరాశకు గురైన ఈయన ఉన్మాదిలా మారి అందరిపై కారం చల్లి తన ఫ్రస్టేషన్ మొత్తం బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఒక్కసారిగా ప్రయాణికుల కళ్ళల్లో కారం కొట్టడంతో ప్రయాణికులు మొత్తం ఆందోళన వ్యక్తం చేసిన ఘటన చోటుచేసుకుంది.