స్మగ్లింగ్ వార్తలపై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

ప్రముఖ టీవీ షో జబర్దస్త్ కమెడియన్ హరిబాబు ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో కీలక పాత్రధారిగా మారారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో అటవీశాఖ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 60 లక్షల విలువైన సుమారు 19 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో పోలీసులను చూసి హరి పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ విషయాలపై హరి స్పందించాడు.

రెండు రోజులుగా తనపై వస్తున్న ఎర్ర చందనం స్మగ్లింగ్ విషాయలపై హరి స్పందించాడు. తనకూ గంజాయ్ స్మగ్లింగ్‌ కు ఎటువంటి సంబంధం లేదని తెలిపాడు. అయితే… 2013లో షకలక శంకర్‌ టీం లో వైఎస్‌ హరిబాబు పని చేశాడని.. తర్వాత అతడు ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కేసులో దొరికాడని.. పోలీసుల ఎంక్వైరీలో అతడు జబర్థస్త్‌ చేసినట్లు కూడా తేలిందని.. క్లారిటీ ఇచ్చాడు.

అయితే అదే పేరుతో అప్పటికే తాను ఫేమ్‌ లో ఉండటం వల్ల గూగుల్‌ లో జబర్ధస్థ్ హరి అని పేరు కొడితే తన ఫొటోలు వస్తున్నాయని తెలిపాడు. దీంతో మీడియా వాళ్లు గూగుల్‌ లో ఆ పేరు కొట్టి.. తన ఫొటోలు తీసుకుంటున్నారని తెలిపాడు. కొన్ని ప్రముఖ ఛానల్స్‌ కూడా తన ఫొటోలు పెట్టి వార్తలు రాశాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా పేరు కలిసినంత మాత్రాన్న ఫోటోలు కలిపేస్తున్న వ్యవహారం వల్ల తాను చాలా అంటే చాలా సఫర్‌ అవుతున్నట్లు హరికృష్ణ తెలిపాడు.

ఇదే సమయంలో తనది చిత్తూరు జిల్లా కాదని.. తనకు గంజాయికీ సంబంధం లేదని.. తనది నూజివీడు అని స్పష్టం చేశాడు.