TG: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాల మార్పులను చేస్తున్నారు ఇందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా తెలంగాణ తల్లి రూపురేఖలను పూర్తిగా మార్చేస్తూ రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ తేదీ సచివాలయంలో నూతన విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఈ విగ్రహ మార్పు పట్ల బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకత చూపుతున్నారు.
ఈ క్రమంలోనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ తల్లి మార్పు విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి అంటే తల్లి ఒక్కరే ఉంటారు ఏదో భార్యలను మార్చినట్టు తల్లిని మార్చడం ఏంటి అంటూ కేటీఆర్ భారీ స్థాయిలో ట్రోల్స్ చేశారు అయితే ఈ విషయంపై మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి స్పందిస్తూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ ను ప్రజలు అసహ్యించుకున్నా, ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా రాజకీయ కుతంత్రాలను కేటీఆర్ సాగిస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియా ట్రోలింగ్స్ తో ప్రజా మద్దతు కూడగట్టుకోవడం ఏ మాత్రం కాదని, ప్రజల మనస్సులు గెలుచుకోవాలని ఎమ్మేల్యే అన్నారు. తెలంగాణ తల్లి అంటే సామాన్య గృహిణి తల్లిగా భావించి కాంగ్రెస్ ప్రభుత్వం తల్లి రూపాన్ని ఏర్పాటు చేస్తే ఓర్వలేక కేటీఆర్ అదేపనిగా ట్రోలింగ్స్ సాగిస్తున్నారన్నారు.
తెలంగాణ సమాజంలో భార్యను మార్చే సంస్కృతి లేదని, అది కూడా తెలియని కేటీఆర్.. భార్యను మారుస్తారు కానీ తల్లిని మారుస్తారా అంటూ కామెంట్స్ చేయడం అతని వివేకానికి ఇది నిదర్శనం అని తెలిపారు. ఇలా భార్యలను మార్చే సంస్కృతి మాకు లేదు బహుశా బిఆర్ఎస్ నేతలకు ఉందేమో అంటూ ఈయన ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.