TG: బీఆర్‌ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈయనతో పాటు మరో 20 మంది బిఆర్ఎస్ నేతలపై కూడా కేసులో నమోదైన విషయం తెలిసిందే. విధులను ఆటంకం కలిగించడన్ని బెదిరింపులకు పాల్పడాన్ని ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఈ విషయంపై కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లడంతో ఈయన వెళ్లేసరికి సీఐ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తాను చేసే ఫిర్యాదును తీసుకొని బయటికి వెళ్లాలి అంటూ కౌశిక్ రెడ్డి తెలిపారు. తాను ఓ స్నేహితుడి పార్టీకి వెళితే శివధర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసి.. అక్కడికి పోలీసులను పంపారని.. నా దగ్గర డ్రగ్స్ పెట్టించి కేసు పెట్టించాలని శివధర్ రెడ్డి ప్రయత్నించారన్నారు. సీఎం రేవంత్, శివధర్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక పోలీసులు ఈ కేసును నమోదు చేయడానికి నిరాకరించడంతో సిఐకి కౌశిక్ రెడ్డి తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు. తాను ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా సీఐ ప్రవర్తించారని.. డీజీపీ కన్నా ఎక్కువ ప్రోటోకాల్ ఎమ్మెల్యేకు ఉంటుందని సీఐకి ఉంటుందని.. పదవులు లేని సీఎం సోదరులకు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు కూడా ఈయన వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి లెక్కలు తేలుస్తామంటూ కూడా ఈయన వార్నింగ్ ఇచ్చారు. ఇకపోతే ఈ వ్యవహారంలో భాగంగా పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు
ఏ క్షణంలోనైనా కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం
మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లనున్న మాజీ మంత్రి హరీష్ రావు, గ్రేటర్ హైదరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు https://t.co/96UMm6oJ8R pic.twitter.com/LeLLfdk2LP
— Telugu Scribe (@TeluguScribe) December 5, 2024