TG: లోకేష్ వ్యాఖ్యలపై నేను స్పందించడం ఏంటి… మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు?

TG: తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య గత కొంతకాలంగా నీళ్ల గురించి భేదాభిప్రాయాలు వస్తున్నాయి అలాగే బనకచర్ల నిర్మాణం గురించి కూడా రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ నీటి ప్రాజెక్టుల గురించి ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి స్పందించారు. సోమవారం నల్లగొండ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గత కొంతకాలంగా నేను ఒకటే మొబైల్ నెంబర్ వాడుతున్నాను. నా ఫోన్ టాపింగ్ జరిగింది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇక కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసని కోమటిరెడ్డి తెలిపారు.కమిషన్ నివేదికపై కేబినేటలో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఏం జరగాలో అది జరిగి తీరుతుంది అంటూ ఈ సందర్భంగా కోమటిరెడ్డి తెలియజేశారు.

ఇకపోతే బనకచర్ల గురించి మంత్రి లోకేష్ మాట్లాడిన వ్యాఖ్యల పట్ల కూడా ఈయన స్పందించారు. బనకచర్ల చాప్టర్ క్లోజ్‌. బనకచర్లని నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతాం. అవసరమైతే కేంద్రంతో కొట్లాడుతాం అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల పట్ల తాను స్పందించనని లోకేష్ లాంటి చిన్న పిల్లాడి వ్యాఖ్యలపై స్పందించనని తెలిపారు.డిండి ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ పూర్తి అయింది. జిల్లా ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలకు లైనింగ్ ఏడాదిలోనే పూర్తిచేస్తాం అని తెలిపారాయన. ఇక రైతు భరోసా కొంతమందికి రాలేదు అంటూ కూడా వార్తలు వచ్చాయి కానీ 100 ఎకరాల పొలం ఉన్న వారికి కూడా రైతు భరోసా వేసామని కోమటిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా ఈయన టిఆర్ఎస్ పార్టీ పై కూడా విమర్శలు కురిపించారు.