TG: కేసీఆర్ ను గద్దెదించడమే రేవంత్ లక్ష్యమా… లక్ష్యం పూర్తయిందన్న రేవంత్!

TG: ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగిన విషయం తెలిసిందే. ఇలా పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన కెసిఆర్ కు 2023 ఎన్నికలలో ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన హామీలను ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకొని ఎన్నికలకు ముందే ఇచ్చిన 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు.

మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న బి ఆర్ ఎస్ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తుంది. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ అమలు చేయలేకపోయిందని మా ప్రభుత్వ హయాంలో మేము తెలంగాణను ముందుకు నడిపిస్తుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం 10 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లారు అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. పలు పథకాలకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడి పై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. నేను అనుకున్న లక్ష్యం పూర్తి అయింది ముఖ్యమంత్రి పీఠం నుంచి ఆయనని దించాలనుకున్నాను.. నా లక్ష్యం పూర్తి అయిందని నాకు ఎలాంటి కోరికలు లేవని రేవంత్ రెడ్డి తెలిపారు.ఉన్న కోరికలు మొత్తం నెరవేరినయి. ఇక ఎటువంటి ఇబంది లేదు. వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు.. జీవితంలో మీరు కూడా ఒక బలమైన లక్ష్యాన్ని ఎంచుకోండి. ఆ లక్ష్యం దిశగా అడుగులు వేయండి. అంతిమంగా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంటూ అక్కడ మహిళలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.