TG: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకులపై అరెస్టులు పర్వం కురుస్తుంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే అయితే త్వరలోనే కేటీఆర్ కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందంటూ ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు మంత్రులు మీడియా సమావేశాలలో కేటీఆర్ అరెస్టు గురించి ప్రస్తావిస్తూనే వచ్చారు. అయితే తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి జగదీశ్ రెడ్డిలు జైలుకు వెళ్లక తప్పదని కోమటిరెడ్డి రాజగోపాల్ తెలిపారు. వీరి అరెస్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా ఉదారభావంగా వ్యవహరిస్తున్నారు అయితే ఆయన స్థానంలో నేనే ఉంటే కనుక ఈ పార్టీకి వీరిని ఎప్పుడూ అరెస్టు చేయించి ఉండేవాడిని తెలిపారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదని తెలిపారు.
ఈ చర్యలు రాజకీయ కక్షతో కాదని వారు చేసిన అవినీతి, అక్రమాల వల్లే ఈ పరిస్థితి దాపురించింది అని చెప్పుకొచ్చారు. గత పది సంవత్సరాలపాటు బిఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని తెలిపారు. ఇక కేటీఆర్ అయితే చాలా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని రాజగోపాల్ తెలిపారు.పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అసలు ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు కుట్రలు చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రి పదవులను ఆశగా చూపి మీ పార్టీలో చేర్చుకోలేదా అంటూ ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.