ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తున్నవేళ అధికార టిఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తున్నది. ఆపద్ధర్మ మంత్రులు, ఎంపికైన అభ్యర్థులంతా నియోజకవర్గాల్లోనే మకాం వేయాలని గులాబీ అధినేత కేసిఆర్ హుకూం జారీ చేశారు. దీంతో అభ్యర్థులు నియోజకవర్గాల్లోకలియదిరుగుతూ ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చారు.
నిర్మల్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నియోజకవర్గంలో మకాం వేశారు. దీంతో గత నాలుగైదు రోజులుగా టీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతోంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ తదితర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. నిర్మల్ నియోజవకవర్గ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు.
నిర్మల్ నియోజకవర్గంలోని లక్ష్మణచాంద, సారంగాపూర్, దిలావర్ పూర్, మామడ ఇలా అన్ని మండలాల, నిర్మల్ పట్టణానికి చెందిన ఇతర పార్టీ నేతలు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామస్తులు టిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్ధతు ప్రకటిం చారు. ఇకపై వచ్చే ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని గ్రామస్తులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎల్లపెల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీకే తమ ఓటు వేస్తామని గ్రామస్తులంతా ప్రతిజ్ఞ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులతోనే టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, నాయకులు, అన్నివర్గాల ప్రజలు తీర్మానం చేశారు.
నిర్మల్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకొంటామని ఎల్లపెల్లి గ్రామస్తులు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతోనే టీఆర్ఎస్ వెన్నం టి ఉంటామని గ్రామస్తులంతా తీర్మానం చేసినట్లు తెలిపారు. తమ గ్రామస్తులంతా టిఆర్ఎస్ కే ఓటేస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమం అనంతరం జరిగిన సామూహిక భోజనాల కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారయణ గౌడ్, యువజన నాయకుడు అల్లోల గౌతం రెడ్డి, ఇతర టీఆర్ఎస్ నేతలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళా సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.