నిర్మల్ లో సోనిక రెడ్డి అనే యువతి ఆత్మహత్య

సోనిక రెడ్డి (31) అనే వివాహిత మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు…

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాస్త్రి నగర్ లోని బాలాజీ అపార్ట్మెంట్ లో ఐదవ అంతస్తు నుంచి దూకి కుంట సోనిక రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమెకు వివాహమైంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

నిర్మల్ పట్టణ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.