తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇతర పార్టీలకు చెందిన చాలామంది నాయకులు వ్యతిరేక పదజాలతో దూషిస్తూ ఉంటారు. అందులో ఒకరు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఈయన గత కొంతకాలం నుండి కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై తెగ విరుచుకు పడుతున్నారు.
ఇక తాజాగా ఈయన.. ఇకపై సీఎంను పరుష పదజాలంతో విమర్శించబోనని అన్నారు. రాజకీయంగా, సాంకేతికంగా కేసీఆర్ ను విమర్శిస్తానని.. ఆవేదనతో చెబుతున్న మాటలివి అన్నారు. ఇక బీజేపీ ఎదుగుదలను.. దిగజారుతున్న టీఆర్ఎస్ గ్రాఫ్ కారణం గానో లేదా ఆయన కుటుంబ రాజకీయ ఒత్తిడి కారణంగానో ఆయన మానసిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంది అని అన్నారు. కేసీఆర్ ఇంట్లో వారసత్వ పోరు మొదలైందని అన్నారు.