పూణే పోలీసులపై తెలంగాణ జర్నలిస్టులు సీరియస్

పూణే పోలీసులు హైదరాబాద్ లో చొరబడి అరెస్టులు చేయడంపై తెలంగాణ జర్నలిస్టు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియు డబ్ల్యూజె) అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె విరాహత్ అలీ ఒక ప్రకటన విడుదల చేశారు. వారు విడుదల చేసిన ప్రకటన యదాతదంగా కింద ప్రచురిస్తున్నాం. చదవండి.

 

పోలీసుల చర్యను ఖండిస్తున్నాం
– టీయుడబ్ల్యుజె
———————————————
ప్రధాని మోదీపై హత్య కుట్రను ఆరోపిస్తూ మహారాష్ట్ర పోలీసులు గతంలో చేసిన ప్రకటనపై విశ్వాసం లేకుండా పోయినందువల్లే , విశ్వాసం కలిగించి తమ ఉనికిని చాటుకోవడానికే సోదాల పేరుతో హైదరాబాద్ లో ప్రజా సంఘాల ప్రముఖులు వరవరరావుతో పాటు మరికొందరి ఇళ్లపై, జర్నలిస్టులు కుర్మానాథ్, టేకుల క్రాంతి ఇళ్లపై దాడులకు పూనుకోవడం, అక్రమ అరెస్టులకు పాల్పడడం విచారకరమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది పౌర హక్కులకు, పత్రికా స్వేచ్చకు భంగం కలిగించే చర్యగా భావిస్తున్నాం.

నగునూరి శేఖర్
(అధ్యక్షులు)

కె.విరాహత్ అలీ
(ప్రధాన కార్యదర్శి)

 

మరో తెలంగాణ జర్నలిస్టు సంఘం కూడా పూనే పోలీసుల తీరును ఖండించింది. కుటుంబసభ్యులను నిర్బంధించి మరీ సోదాలు చేయడాన్ని టియుడబ్ల్యూజె అధ్యక్షులు అల్లం నారాయణ ఖండించారు. ఆ సంఘం నేతలు విడుదల చేసిన ప్రకటన కింద యదాతదంగా ఇస్తున్నాం.

జర్నలిస్టు ఇండ్లలో పోలీసుల అక్రమ సోదాలను ఖండించిన టీయూడబ్ల్యూజే

మోడీ హత్యకు కుట్ర పేరుతో పూణే పోలీసులు విరసం నేత వరవరరావును అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా.. జర్నలిస్ట్ కూర్మనాథ్, మరో జర్నలిస్టు క్రాంతి టేకుల ఇండ్లల్లో అక్రమంగా సోదాలు చేయడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఒక ప్రకటనలో ఖండించింది. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా చొరబడి కుటుంబ సభ్యులతో సహా అందరిని నిర్భంధించి సోదాలు నిర్వహించడం అక్రమమని యూనియన్ అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి క్రాంతి లు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి జీవనాడి లాంటి వ్యక్తి వరవరరావు 78ఏళ్ల వయస్సులో హత్య కుట్ర అంటూ వేధించడాన్ని తెలంగాణ సమాజం హర్షించదు అనే విషయాన్ని కేంద్రంలోని బి జె పి ప్రభుత్వం తెలుసుకుంటే మంచిదని వారన్నారు. అర్దరాత్రుల్లో ఇంట్లో చొరబడి సోదాలు చేయడం కరెక్ట్ కాదని టి యు డబ్ల్యూ జె అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ లు విమర్శించారు. ఈ అక్రమ అరెస్టు, సోదాలను తీవ్రంగా ఖండిస్తన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

 

జర్నలిస్ట్ ఫెడరేషన్ ఖండన 

పూణే పోలీసుల చర్యను ఖండిస్తున్నాం
– TWJF
————————————
ప్రధాని మోదీపై హత్య కుట్రను ఆరోపిస్తూ మహారాష్ట్ర పోలీసులు గతంలో చేసిన ప్రకటనపై విశ్వాసం లేకుండా పోయినందువల్లే , విశ్వాసం కలిగించి తమ ఉనికిని చాటుకోవడానికే సోదాల పేరుతో హైదరాబాద్ లో ప్రజా సంఘాల ప్రముఖులు వరవరరావుతో పాటు మరికొందరి ఇళ్లపై, జర్నలిస్టులు కుర్మానాథ్, టేకుల క్రాంతి ఇళ్లపై దాడులకు పూనుకోవడం, అక్రమ అరెస్టులకు పాల్పడడం విచారకరమని TWJF రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవ పున్నయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది పౌర హక్కులకు, పత్రికా స్వేచ్చకు భంగం కలిగించే చర్యగా భావిస్తున్నామని తెలిపారు .