విషాదం : గుండెపోటుతో మరో తెలుగు జర్నలిస్టు మృతి

తెలుగు జర్నలిస్టు సమాజానికి మరో విషాద వార్త. తీవ్ర మానసిక వత్తిడి, చాలి చాలని జీతాలు, కరువైన భద్రత, భవిష్యత్తుపై భరోసా కోల్పోయిన కారణంగా ఇటీవల కాలంలో తెలంగాణలో చాలా మంది జర్నలిస్టులు మృత్యువాత పడ్డారు. తాజాగా మోహన్ రావు అనే తెలుగు జర్నలిస్టు గుండెపోటుతో మరణించారు. 

తెలుగు నేల మీద ఇటీవల కాలంలో కొందరు గుండెపోటుతో మరణించారు. మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారు. తెలుగు జర్నలిజంలో మోహన్ రావు సుదీర్ఘ కాలంగా పనిచేశారు. ఆంధ్రప్రభ లో ఎక్కువ కాలం పనిచేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. 

మోహన్ స్వస్థలం రాజమండ్రి. హైదరాబాద్ లోనే మోహన్ జర్నలిజం కెరీర్ సాగింది. ఉస్మానియా యూనివర్శిటీలో ఎంఎ సోషియాలజీ చదివారు.

డిసెంబరు 15, 1968లో జన్మించిన మోహన్ చిన్న వయసులోనే గుండెపోటుతో రాలిపోవడం జర్నలిస్టు వర్గాలను కలిచి వేస్తోంది. మోహన్ భౌతికఖాయాన్ని రాజమండి సమీపంలోని ఆయన స్వగ్రామం రాఘవపురం తరలించారు. అక్కడే అంత్యక్రియలు జరపనున్నారు. 

గురువారం చాతిలో నొప్పి కారణంగా మోహన్ ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఆసుపత్రిలో ఉండగానే గుండెపోటు వచ్చింది. తీవ్రమైన స్ట్రోక్ రావడంతో ఆయన మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు.  

మోహన్ కు ఒక బాబు, పాప ఉన్నారు. మోహన్ సతీమణి ఖమ్మంలో డిగ్రీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.