కేరళ ప్రకృతి విలయానికి 300 మందికి పైగా నిరాశ్రయులయ్యారు, ఎంతోమంది నిర్వాసితులయ్యారు. కేరళ రాష్ట్రానికి తమవంతు సాయం అందివ్వడానికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, స్వచ్చంద సంస్ధలు కేరళ వరద బాధితులను ఆదుకోవటానికి తోచిన విరాళాలు ఇస్తూ క్యాంపైన్ కూడా నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేరళ ఫ్లడ్ రిలీఫ్ యాక్టివిటీస్ కోసం రాష్ట్రం తరపున 25 కోట్ల రూపాయలను ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ హోమ్ మినిష్టర్ నాయిని నరసింహారెడ్డి 25 కోట్ల రూపాయల చెక్ ని స్వయంగా కేరళకు వెళ్లి ముఖ్యమంత్రి విజయన్ పినరై చేతికి అందించారు. కేరళ వరద భీభత్సం గురించి పరామర్శించారు. కేరళ ముఖ్యమంత్రి గణం నాయినికి కృతజ్ఞతలు తెలిపారు. కింద వీడియోలో ఆ దృశ్యాలు చూడవచ్చు.
Rs 25 Cr Cheque as immediate Assistance from #Telangana Government for Flood relief activities being handed to Sri @vijayanpinarayi, Chief Minister of Kerala by Sri Nayani Narsimha Reddy, Home Minister of Telangana.#TelanganaStandsWithKerala #KeralaFloods pic.twitter.com/IHtSuawEgw
— TRS Party (@trspartyonline) August 19, 2018