తీవ్ర ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఎక్కడా పెద్దగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. గ్రామీణ ఓటర్లు మరోసారి తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో చైతన్యాన్ని చాటిచెప్పారు. పోలింగ్ బూత్ ల వద్ద రూరల్ ఓటర్లు బిగ్ క్యూ లైన్లలో నిలబడి ఓపికతో ఓట్లేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో గెలుపెవరిది అన్న చర్చలు ఊపందుకున్నాయి.
టిఆర్ఎస్ మళ్లీ వస్తుందని ఆ పార్టీ దీమాతో ఉండగా కూటమిదే గెలుపు అని ప్రత్యర్థి పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక హంగ్ వస్తే తామే కింగ్ అని ఆశతో ఎదురుచూస్తున్నాయి బిజెపి, ఎంఐఎం పార్టీలు. ఈ నేపథ్యంలో జాతీయ ఛానెళ్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువరించాయి. జాతీయ ఛానెళ్లు తెలంగాణలో స్పష్టమైన వైఖరిని వెలువరించలేదు. టైమ్స్ నౌ సంస్థ టిఆర్ఎస్ మళ్లీ అధికారం చేజిక్కించుకుంటుందని వెల్లడించింది. టిఆర్ఎస్ 66 సీట్లు కూటమి 37 సీట్లలో గెలవబోతున్నట్లు తేల్చింది. బిజెపి 7 సీట్లలో గెలుస్తుందని తేల్చింది. ఇక ఇతరుల జాబితాలో 14 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఆ 14లో ఎంఐఎం 7 వరకు వచ్చే చాన్స్ ఉందని, మిగతా 7 ఇండిపెండెంట్లకు రావొచ్చని తేల్చింది.
రిపబ్లిక్ టివి ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ :
జాతీయ మీడియాలో పాపులర్ చానెల్ అయిన రిపబ్లిక్ టివి టిఆర్ఎస్ కే మొగ్గు చూపినట్లు ఫలితాలు ఇచ్చింది. ఆ పార్టీకి 50 నుంచి 65 సీట్లు వస్తాయని తేల్చింది. కూటమికి 38 నుంచి 52 స్థానాలు రావొచ్చని తేల్చింది. బిజెపికి 4 నుంచి 7 స్థానాలు రావొచ్చని, ఇతరులు 10 నుంచి 17 రావొచ్చని తేల్చింది.
సిఎన్ఎన్ ఐబిఎన్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ :
సిఎన్ఎన్ ఐబిఎన్ సంస్థ కూడా టిఆర్ఎస్ కే చాన్స్ ఉన్నట్లు తేల్చింది. 50 నుంచి 65 స్థానాల్లో టిఆర్ఎస్ వస్తుందని తేల్చింది. మహా కూటమి 38 నుంచి 52 రావొచ్చని తేల్చింది. బిజెపి 4 నుంచి 7 రావొచ్చని, ఇతరులు 10 నుంచి 17 స్థానాల్లో గెలుస్తారని తేల్చింది.
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ :
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ కూడా టిఆర్ఎస్ వైపే జనాలు మొగ్గు చూపినట్లు చబుతున్నది. టిఆర్ఎస్ కు 79 నుంచి 91 సీట్లు వస్తాయని తేల్చింది. మహా కూటమి 21 నుంచి 33 సీట్లు రావొచ్చని లెక్కలేసింది. ఇక బిజెపి 1 నుంచి 3 సీట్లకు పరిమితం కావొచ్చని చెప్పింది.
న్యూస్ ఎక్స్ సర్వే ఫలితాలు ఇవి :
ఈ సంస్థ కూడా టిఆర్ఎస్ కే మొగ్గు చూపినట్లు చెప్పింది. టిఆర్ఎస్ కు 57 స్థానాలు రాబోతున్నట్లు తేల్చింది. కాంగ్రెస్ కు 46 సీట్లు, బిజెపికి 6 సీట్లు రావొచ్చని చెప్పింది. ఇక ఇతరులకు 10 సీట్లు రావొచ్చని తేల్చింది. అందులోనే ఎంఐఎం సీట్లు కలిపింది.
NewsX survey Telangana
TRS. – 57
Cong -46
BJP – 06
Oth – 10
సి ఓటర్ సర్వే ఫలితాలు :
ఇక సి ఓటర్ ఎగ్జిట్ పోల్స్ ఇందుకు భిన్నంగా ఉన్నాయి. సి ఓటర్ ఎగ్జిట్ పోల్సో ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ కూటమికి 70 సీట్లు రావొచ్చని తేల్చింది. టిఆర్ఎస్ కు 35 సీట్లు రావొచ్చని తేల్చింది. సి ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, చత్తీస్ ఘర్, రాజస్థాన్, మిజోరాం ఫలితాలు వెలువరించింది. అవి కింద ఉన్నాయి చూడొచ్చు.
C voter exit poll
MP cong-118
Bjp-98
Chattisgarh-cong-46
Bjp -39
Telangana-Cong+ – 70
Trs – 35
Rajasthan cong—125
Bjp 70
Mizoram cong-16
MNF-18
ind-5
ఎప్పటిలాగే నగర ఓటర్లు మరోసారి నిర్లక్ష్యం ప్రదర్శించారు. హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతం గ్రామీణ ఓటింగ్ శాతం తో పోలిస్తే బాగా వెనుకబడింది. అయితే పెద్ద ఎత్తున హైదరాబాద్ వాసులు తమ స్వస్థలాల్లో ఉన్న ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోయారు. పనిలోపనిగా వరుస సెలవులు రావడం కూడా కలిసివచ్చింది. దీంతో హైదరాబాద్ నగరం అంతా ఖాళీ అయిపోయింది. రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.
జాతీయ ఛానెళ్ల ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజం, ఎంత వరకు నిజం కాదు అన్నదానికి కొలబద్ద ఏమీ లేదు. ఎందుకంటే అనేక సందర్భాల్లో జాతీయ ఛానెళ్ల ఎగ్జిట్ పోల్స్ తలకిందులైన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల విషయంలో ఎవరి అంచనాలు నిజమవుతాయన్నది 11 వ తేదీన మాత్రమే తేలనుంది.