తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇంతకుముందున్నట్టు లేవు ఆయన మాటలు. మునుపు జాతీయ పార్టీల ప్రస్తావన వస్తే ఇంతెత్తున ఎగిరే ఆయన ఇప్పుడు మాత్రం సఖ్యతగా మాట్లాడుతున్నారు. మరి ఈ మార్పుకు కారణం ఏమిటై ఉంటుంది అంటే ఢిల్లీ టూర్ అంటున్నారు ఆంప్దరూ. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నుండి విపరీతమైన పోటీ ఎదుర్కొన్న తెరాస కొద్దిపాటి సీట్ల మెజారిటీతో బయటపడింది. బీజేపీ అయితే అనూహ్యంగా పుంజుకుని కేసీఆర్ కు చెమటలు పట్టించింది. ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడంతో కేంద్రంతో సున్నం పెట్టుకోవడం మంచిది కాదని, రాష్ట్రంలో కూడ ఆ పార్టీ బలపడుతోందని గ్రహించిన కేసీఆర్ ఢిల్లీ పేదలతో సామరస్యం కోరుకున్నారని, ఈ సమావేశంలో చాలా ఒప్పందాలు జరిగాయని, ఇకపై కేంద్రం పట్ల కేసీఆర్ వైఖరి మారిపోతుందని ప్రత్యర్థి పార్టీలు జోస్యం చెప్పాయి.
ప్రజెంట్ పరిస్థితులు చూస్తుంటే వాళ్ళు చెప్పిందే నియమవుతోందా అనిపిస్తోంది. ఎదుకంటే కీలకమైన విషయాల్లో కేసీఆర్ తీరు మారింది. ఇటీవల మోదీ ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ చట్టాల మీద సర్వత్రా వ్యతిరేకతమవుతోంది. ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనకు మద్దతుగా బీజేపీయేతర ప్రభుత్వాలు చాలావరకు మద్దతిచ్చాయి. కేసీఆర్ సైతం ఈ వ్యవసాయ చట్టాలను తప్పుబట్టారు. తెలంగాణాలో మారుమూల పంటలు పండించిన రైతులు ఢిల్లీ మూసుకుపోయి అమ్ముకోవాలా అంటూ ఎద్దేవా చేశారు. రైతుల మోటార్లకు మీటర్లు బిగించమని తేల్చి చెప్పేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఈ అంశాన్నే ప్రధాన ఆయుధంగా మలుచుకోవాలని అనుకున్నారు. బీజేపీ మీద విమర్శలను ఆ దిశగానే సంధించారు. కానీ దుబ్బాక ప్రజలు, గ్రేటర్ ఓటర్లు వాటిని పెద్దగా పట్టిచుకోలేదు. దీంతో ఎన్నికల్లో తెరాస ఓడింది.
దీంతో లాభంలేదనుకున్న కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. వెళ్లిన రెండు వారాలకు స్వరం మార్చారు. గ్రామాల్లో ఉన్న పంట కొనుగోళ్ల కేంద్రాలను ఎత్తివేయాలని నిర్ణయించారు. గత ఏడాది రైతుల నుండి పంటను కొనుగోలు చేయడం వలన 7 వేల భారం పడిందని, ప్రతి ఏడు ఇలాగె కొనాలంటే కుదరదని చెబుతూ ఒకే మార్కెట్ ఒకే దేశం నినాదానికి పరోక్షంగా మద్దతిచ్చినట్టు మాట్లాడేశారు. అంతేకాదు నియంత్రిత సాగు విధానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం నాడు వ్యవసాయం, రైతుబంధు సహా పలు కీలక అంశాలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి వ్యవసాయానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై తెలంగాణలో నియంత్రిత సాగు విధానం ఉండబోదని సీఎం స్పష్టం చేశారు. రైతులు తమకు నచ్చిన పంటను సాగు చేసుకోవచ్చునని అన్నారు. మార్కెట్ పరిస్థితులను బట్టి ఏ సీజన్‌లో ఏ పంట వేయాలో రైతులు చర్చించుకోవాలని తెలిపారు. రైతుల ఆందోళనకు మద్దతుగా బంద్ చేసిన కేసీఆర్ ఇలా మాట్లాడటంతో జనం సైతం విస్తుపోతున్నారు. ఇక కాంగ్రెస్ నేతలైతే ఇది పెద్ద యూటర్న్ అని అంటున్నారు.