దుబ్బాక ఎన్నికల ఫలితం బీజేపీ నాయకులలోనూ మరియు కార్యకర్తలలోను ఉత్తేజాన్ని నింపింది . రోబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కాస్త గట్టిగా ప్రయత్నిస్తే కచ్చితంగా విజయం సాధించవచ్చు అని నమ్మకం దుబ్బాక ఎన్నికలు నిజం చేశాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో బిజెపి నేతలు ఇప్పుడు ఎన్నికల మీద కాస్త గట్టిగా ఫోకస్ చేసారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా తెరాస పార్టీకి షాక్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా కొంత మంది తెరాస పార్టీ నాయకులని, కార్య కర్తలని బిజెపిలోకి చేర్చుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన సమక్షంలో బీజేపీలోకి అంబర్ పేట్ టీఆర్ఎస్ నాయకుడు కత్తుల సుదర్శన్, శ్రీలత చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ లో మార్పు రావాలని జిహెచ్ఎంసి లో బీజేపీ గెలవాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. ప్రస్తుతం ప్రగతి భవన్ లో కేసీఆర్ ఉన్నారు… రాబోయే రోజుల్లో అసదుద్దీన్ ఒవైసి రావాలని తాపత్రయ పడుతున్నాడు అని మండిపడ్డారు. బీజేపీ ఉన్నంత వరకు అసదుద్దీన్ ఒవైసి ని రాకుండా అడ్డుకుంటుందని పేర్కొన్నారు. టీఆరెస్ పార్టీ లో కీలకపాత్ర పోషిస్తూ అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం లో ఉన్న కత్తుల సుదర్శన్, శ్రీలత లకు బీజేపీ లోకి స్వాగతం పలుకుతున్నా అని, వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.తమ పార్టీ లో వారికి సముచిత స్థానం లభిస్తుందని , అక్కున చేర్చుకుని గౌరవమిస్తామని ఆయన తెలిపారు.