KTR: అసెంబ్లీ వద్ద కలకలం సృష్టించిన టీ షర్ట్… అరెస్ట్ అయిన కేటీఆర్!

KTR: తెలంగాణ సీతకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి ఈ క్రమంలోనే బిఆర్ఎస్ నేతలు వినూత్నంగా నిరసనలు తెలిపారు. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇలా కేటీఆర్ అరెస్టుపై బిఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా సంచలనమైన ట్వీట్ చేసింది. ఇటీవల కాలంలో అదానీ నుంచి సిల్క్ యూనివర్సిటీ కోసం రేవంత్ రెడ్డి 100 కోట్ల రూపాయల విరాళం అందుకున్న విషయం తెలిసిందే.

అదానీ పై అమెరికాలో ఇటీవల కేసు నమోదు కావడంతో ఈ విషయం కాస్త రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనంగా మారింది. ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా ఆదాని నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారని కూటమి నేతల ఆరోపణలు చేయగా మరోవైపు రేవంత్ రెడ్డి కూడా వందకోట్ల రూపాయలు లంచం తీసుకున్నారంటూ విమర్శలు కురిపించారు.

ఈ విధంగా ఆదాని నుంచి రేవంత్ రెడ్డి 100 కోట్ల రూపాయలు తీసుకోవడంతో ఈయన పట్ల విమర్శలు వస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి ఆ వంద కోట్ల రూపాయలను తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా ఆదాని రేవంత్ రెడ్డి మధ్య భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారాయని బిఆర్ఎస్ నేతలు తాజాగా ఆదాని రేవంత్ రెడ్డి ఉన్నటువంటి టీ షర్టులతో నిరసనలు తెలియజేశారు.

ఇలా ఆదాని రేవంత్ రెడ్డి ఉన్నటువంటి టీ షర్టులతో కేటీఆర్ నిరసనలు చేస్తున్న నేపథ్యంలో ఈయనని అసెంబ్లీలోకి రాకుండా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు అంటూ బిఆర్ఎస్ ట్వీట్ చేసింది. ఇలా టీ షర్టులతో ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో బిఆర్ఎస్ నేతలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పలువురు ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

KTR Wear CM Revanth Photo TShirt In Assembly| రేవంత్ షర్ట్ తో అసెంబ్లీ కి కేటీఆర్|Zee Telugu News