కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలకు గాను బీజేపీ కౌంటర్లు వేస్తోన్న సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి భాష ప్రధానం అంటూ హెచ్చరించారు. ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఆలోచించుకోవాలన్నారు. ఉన్నతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు హుందాగా నడుచుకోవాలని..ప్యాకేజీపై అభ్యంతారులంటే పద్ధతిగా చెప్పాలని..అంతేగానీ నోటికొచ్చినట్లు ఇష్టానుసారం మాట్లాడవద్దని గట్టిగానే కౌంటర్ వేసారు. తాజాగా ఏపీకి చెందిన బీజేపీ నేత సోము వీర్రాజు కేసీఆర్ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. కేసీఆర్ మాట్లాడినట్లుగా బీజేపీ, మోదీ పరువు ఎక్కడికి పోలేదన్నారు.
కేసీఆర్ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. వీడదీసి మాట్లాడటం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, మతిలేని మాటలు వాగడం మంచిది కాదని హెచ్చరించారు. కేసీఆర్ ఏమాత్రం అవగాహాన లేక, కొంచెం చుక్కు ఎక్కువై అలా మాట్లాడారని మండిపడ్డారు. దీంతో సోము వీర్రాజు వ్యాఖ్యలు ఏపీ సహా తెలంగాణలో రాష్ర్టంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో కేసీఆర్ వ్యక్తిగత విషయం గురించి ప్రస్తావించడం తెలంగాణ ప్రజల్లో ఆసక్తి సంతరించుకుంది. కేసీఆర్ మద్యం ప్రియులని గతంలో కొన్ని కథనాలు వేడెక్కించా యి. ఆ మధ్య ఆయన అనారోగ్యానికి గురి కావడానికి అధిక మోతాదులో ఆల్కాహాలు తీసుకోవడం వలనేని..అందుకే ఇంట్లో కూర్చునే ప్రజల్ని పాలించారని ప్రతిపక్షాలు విమర్శించాయి.
తాజాగా సోము వ్యాఖ్యలు నేరుగా చుక్క ఎక్కువైందంటూ వ్యాఖ్యానించడం కేసీఆర్ అభిమానులు, ఫాలోవర్స్, కార్యకర్తలకు కోపం తెప్పించింది. సోము వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై అలాంటి పదజాలం వాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మా ముఖ్యమంత్రి మాట కఠువుగా ఉన్న…మనసు వెన్న అంటూ సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్ మోదీ ప్యాకేజీపై నోరు జారి ప్రజలందరి నోళ్లలో నానడం హైలైట్. గతంలో నటసింహ బాలకృష్ణ కూడా ప్రధాని మోదీపై ఇలాగే హిందీ భాషలో నోరు జారి అక్షింతలు వేయించుకున్నాడు. దేశ ప్రధానినే పట్టుకుని అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడుతావా? అంటూ బీజేపీ నేతలు ఫైర్ అయిన సంగతి తెలిసిందే.