శ్రీ తేజ్ లేటెస్ట్ హెల్త్ అప్డేట్.. డాక్టర్లు ఏమంటున్నారంటే!

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప 2 కలెక్షన్ పరంగా దూసుకుపోతుంది. రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ బాహుబలి 2 రికార్డ్స్ ని బద్దలు కొట్టే ప్రయత్నంలో ఉంది. ఈ శుభవార్త ప్రేక్షకులకు బాగానే ఉంది కానీ పుష్ప టు బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాదులో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీ తేజ ఇంకా హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ ఉండడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఆ రోజు నుంచి నేటి వరకు ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ హెల్త్ అప్డేట్స్ వైద్యులు సోమవారం విడుదల చేశారు.

రెండు రోజులుగా మినిమల్ వెంటిలేటర్ తో శ్రీతేజ్ కి వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. న్యూరోలాజికల్ స్టేటస్ లో పెద్దగా మార్పు లేదని అన్నారు. పైపు ద్వారానే శ్రీతేజ్ కి ఆహారం అందిస్తున్నట్లు చెప్పారు. ఎడమవైపు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిందని ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. దీంతో తను త్వరగా కోలుకోవాలని చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు సైతం నేరుగా కిమ్స్ ఆసుపత్రికి వచ్చి శ్రీ తేజ్‌ను చూసి తన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకొని వెళ్లారు.

కోర్టులో కేసు ఉన్న కారణంగా అల్లు అర్జున్‌ పరామర్శించలేకపోయారు. దిల్ రాజు కూడా బాలుడిని చూడటానికి హాస్పిటల్ కి వెళ్ళారు. పుష్ప-2 సినీ బృందం అందించిన మొత్తాన్ని బాధిత కుటుంబంతో మాట్లాడి ఫిక్స్​డ్ డిపాజిట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే.

హీరో అల్లు అర్జున్ మూవీ చూసేందుకు రాగా.. అభిమానులు పోటెత్తంటో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో అదే థియేటర్‌కు సినిమా చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో బాలుడికి చికిత్స అందుతోంది. నాటి నుంచి చిన్నారి శ్రీతేజ్ మృత్యువుతో పోరాడుతున్నారు.