తెరాస ప్రభుత్వ స్కీమ్ లన్నీ స్కామ్ లేనా.. ఆ ఎంపీ కామెంట్లు నిజమేనా?

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బంధు స్కీమ్ వల్ల రైతులకు ఎంతగానో ప్రయోజనం కలుగుతోంది. ఈ స్కీమ్ వల్ల రాష్ట్రంలో ఆత్మహత్యలు తగ్గాయని కామెంట్లు వినిపించాయి. అయితే తెలంగాణ ప్రభుత్వ స్కీమ్ లన్నీ స్కామ్ లని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఆ హామీని విస్మరించారని లక్ష్మణ్ పేర్కొన్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేకపోయారని లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన అవినీతి బయటపడకూడదని సీబీఐపై ఆంక్షలు అమలవుతున్నాయని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ లు స్కామ్ లయ్యాయని కేంద్ర ప్రభుత్వ స్కీమ్ లను తెలంగాణ సర్కార్ పక్కదారి పట్టిస్తోందని లక్ష్మణ్ వెల్లడించడం గమనార్హం.

ఎక్కువ సంఖ్యలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి కేసీఆర్ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నేతలప జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులకు మోదీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయంగా కేసీఆర్ ను ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధమేనని ఆయన చెప్పుకొచ్చారు. తెరాసకు బీటీమ్ గా కాంగ్రెస్ మారిందని ఆయన తెలిపారు.

బీజేపీ ఎంపీ చేసిన కామెంట్లపై కేసీఆర్ సర్కార్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో ఇతర పార్టీల నేతల నుంచి కేసీఆర్ సర్కార్ పై అరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇతర పార్టీల విమర్శలకు ధీటుగా బదులివ్వడంలో తెరాస సర్కార్ ఫెయిల్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.