నిత్యం వివాదాల్లో ఉండే టిఆర్ఎస్ అందోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్ మరో పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ప్రగతి నివేదన సభ ఏర్పాట్లలో భాగంగా ఆందోల్ లో ర్యాలీ జరిపారు. బండ్లు ప్రగతి సభకు బయలుదేరే ముందు ర్యాలీని కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే బాబుమోహన్ ప్రారంభించారు.
ఆ సమయంలో హారతి కర్పూరం మంటకు జెండా తగిలే ప్రమాదం ఉందంటూ కార్యకర్త బాబుమోహన్ కు సూచిస్తున్నాడు. దీంతో తనకు ఆ ముచ్చట చెప్పబోతున్న కార్యకర్తపై బాబుమోహన్ సీరియస్ అయ్యారు.
అంతే కాదు ఆ కార్యకర్తను తన్నబోయిండు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. నిత్యం నోటికి పని చెప్పే పేరున్న బాబు మోహన్ మరోసారి తన తీరును బయట పెట్టుకున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసే నాయకులు ఉన్న ఈరోజుల్లో బాబు మోహన్ మాత్రం ఇలా తన్నాలని చూడడం దారుణమంటున్నారు. కింద వీడియో ఉంది చూడండి. బాబూమోహన్ కోపంతో ఎలా రగిలి తన్నబోతున్నారో…