సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్ధి, నిరుద్యోగ ఆవేదన సభ ఉద్రిక్తంగా మారింది. సభకు అనుమతి లేదంటూ పోలీసులు సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. వేలాది మంది విద్యార్ధులు నాయకులు సభను నిర్వహించేదుకు ర్యాలీగా బయలు దేరడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
పోలీసులకు కార్యకర్తలకు జరిగిన తోపులాటలో జగ్గారెడ్డి కిందపడ్డాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. కార్యకర్తలకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు కార్యకర్తలను, జగ్గారెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిందేమి లేదని రాష్ట్రాన్ని లూటీ చేసిన దొంగ కేసీఆర్ అని జగ్గారెడ్డి విమర్శించారు. కేసీఆర్ కనీసం నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. గురువారంతో తెలంగాణకు కేసీఆర్ పీడ విరగడమైందని అన్నారు.