ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్న: డబ్బులు ప్రజలవా.? నాయకులవా.?

ఐపీఎస్ అధికారిగా ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలేసి, ప్రజా సేవ.. అంటూ రాజకీయాల్లోకొచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిన్నే బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అధికారంలో వున్న పార్టీల్ని ఉద్దేశించి కీలకమైన ప్రశ్నల్ని సంధించారు. ‘వెయ్యి కోట్లను దళితుల కోసం ఇస్తామంటున్నారు.. ఆ డబ్బులు ప్రజలవా.? మీ సొంత ఆస్తుల నుంచి తీసి ఇస్తున్నవా.?’ అంటూ ప్రశ్నించారు. సుదీర్ఘ కాలం పాటు ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, రాజకీయ వ్యవస్థలోని లోటుపాట్ల గురించి తెలియకుండా వుంటారా.? ఆయన అధికారిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో అందుకున్న వేతనం కూడా ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కట్టడం ద్వారా నిండిన ఖజానా నుంచి వచ్చినదే. ఏ రాజకీయ పార్టీ అధికారంలో వున్నా, ప్రజల సొమ్ముల్ని తిరిగి ప్రజలకే ఖర్చు చేయాల్సి వుంటుంది.

ఇందులో ఎవరికీ ఎలాంటి డౌటానుమానాలు అక్కర్లేదు. ఎన్నికల సమయంలో మాత్రం, రాజకీయ పార్టీలు, నాయకులు సొంత డబ్బులు ఖర్చు చేస్తారు.. అవీ ఓట్లను కొనుగోలు చేసేందుకు. ఎన్నికల్లో గెలిస్తే, ఖర్చు చేసినదినికి పది రెట్లో, పాతిక రెట్లో సంపాదించుకోవడం రాజకీయ నాయకులకి అలవాటే. మొత్తం రాజకీయ వ్యవస్థే అలా తగలడింది. ఇక, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, బీఎస్పీలో చేరారు. ఆ బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా చాలానే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాంటి పార్టీలో చేరడం ద్వారా ప్రవీణ్ కుమార్ ఏం సంకేతాలు పంపుతున్నట్టు.? అన్న విమర్శ లేకపోలేదు. తాను ఎప్పుడైతే ఉద్యోగం మానేసి, రాజకీయాల వైపు అడుగులు వేశానో, ఆ వెంటనే అన మీద అక్రమ కేసులు బనాయించారనీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అంటున్నారు. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన సమయంలోనే, ఆయనకు పోలీసు వ్యవస్థ ఎలా వుందో తెలిసి వుండాలి. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో అర్థమే లేదు.