ఒక్క ఫోటో… రేవంత్ ను ఆడుకుంటున్న నెటిజన్లు!

రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేత. వాస్తవానికి టీడీపీ నేత అయినప్పటికీ కాంగ్రెస్ చేరిన అతికొద్దికాలంలోనే సీనియర్లందరినీ సైడ్ చేసేసి పీసీసి చీఫ్ అయిపోయారు. మిగిలిన నాయకులతో పోలిస్తే… అధికారంలో ఉన్నా లేకున్నా… రేవంత్ పై అవినీతి ఆరోపణలు నిత్యం వస్తుండటం గమనార్హం. ఇందులో ఓటుకు నోటు ఒకటి కాగా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నారనే ఆరోపణ మరొకటి. దీనిపై ఏకంగా… “రేటెంత రెడ్డి” అనే క్యాంపైన్ నే స్టార్ట్ చేసింది బీఆరెస్స్.

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగా అధికార బీఆరెస్స్, కాంగ్రెస్ పార్టీలు వితౌట్ గ్యాప్ జనాల్లో తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరుపున ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో బైక్ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ కేడర్ లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చే పనిలో ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కనిపించిన ఒక దృశ్యం హాట్ టాపిక్ గా మారింది.

ఇందులో భాగంగా… ప్రచార వాహనంపై నిల్చున్న రాహుల్ గాంధీ హిందీలో ప్రసంగిస్తుండగా.. శ్రీధర్ బాబు ట్రాన్స్ లేట్ చేస్తున్నారు! ఈ సమయంలో ఎండకు బయపడో.. లేక, మరే కారణమో తెలియదు కానీ… వారిద్దరి వెనుక కింద కూర్చున్న రేవత్ రెడ్డి తలపై చెయ్యి పేట్టుకుని దిగాలుగా కనిపించినట్లుగా ఉన్న ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో… ఈ ఫోటోపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

మనిషైతే కాంగ్రెస్ లో ఉన్నాడు కానీ… మనసంతా టీడీపీలో ఉందని కొందరంటుంటే… మనిషి తెలంగాణలో, మనసు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కీలక సమయంలో సలహాలు తీసుకోవడానికి తన రాజగురువు చంద్రబాబు లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుందంటూ మరికొందరు కామెంట్లు చేస్తుండగా… ఓటు కు నోటు సుప్రీంలో ఉందని మరికొందరు గుర్తు చేస్తున్నారు!

కాగా… 2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం టీడీపీకి మద్దతు తెలపాలంటూ.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ మద్దతును ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరే సందర్భంలో.. సూట్‌ కేసులతో 50 లక్షలు ఇస్తూ కెమెరాకు రెడ్ హ్యాండెడ్‌ గా చిక్కారు! అయితే.. ఆ డబ్బులు ఇచ్చింది చంద్రబాబేనని తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

అనంతరం చంద్రబాబు హైదరాబాద్ వదిలి అమరావతికి హుటాహుటున వచ్చేశారు. నాటినుంచి రాజధాని విషయంలో ఏపీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది! నేడు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కూడా నాడు బాబు చేసిన బాగోతమే కారణం అని అంటుంటారు! ఆనాడే పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో ఉంటూ… ఏపీలో రాజధాని నిర్మాణం ప్రశాంతంగా చేసుకుని ఉంటే.. ఈపాటికి అద్భుతమైన నగరం సాక్షాత్కరించేదని చెబుతుంటారు.