Revanth Reddy: కెసీఆర్ ఇప్పటికైనా నీ పెద్దరికం నిలబెట్టుకో.. రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్!

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో సచివాలయం, వ్యక్తిగత ఫాంహౌస్‌లను నెలల వ్యవధిలోనే నిర్మించారని.. రూ.కోట్లు ఖర్చు పెట్టి 33 జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కూడా నిర్మించారని తెలిపారు. కానీ పేదల కల అయినటువంటి సొంత ఇంటిని మాత్రం నిర్మించే ఇవ్వలేకపోయారని మళ్ళీ పడ్డారు.

రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో కేసీఆర్ చేతుల్లోకి రాష్ట్రం వచ్చిందని.. పదేళ్ల పాలనలో రూ.7లక్షల కోట్లు అప్పు చేసి మాకు అప్పగించారని సెటైర్లు వేశారు. అప్పులు చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను సైతం అమ్మేసారని ఈయన గత ప్రభుత్వ పాలనపై ఎద్దేవా చేశారు. గత 60 సంవత్సరాల కాలం నుంచి తెలంగాణను కాంగ్రెస్ అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా భావించి పాలించింది. కానీ గత పది సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అర్థిక సంక్షోభంలోకి నెట్టేశారని ధ్వజమెత్తారు. చేసిన అప్పులకు వడ్డి కట్టడానికి మళ్లీ అప్పు చేయాల్సిన దుస్థితి దాపురించిందని అన్నారు.

ప్రభుత్వం అంటే కేవలం 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదని.. 119 మంది సభ్యులు కలిస్తేనే ప్రభుత్వమని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి పాలక పక్షానికి ఒకే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం ఏం సాంప్రదాయమని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి కుర్చీ ఖాళీగా ఉడటం రాష్ట్రానికి శ్రేయస్కరం కాదని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఆయన సభకు వచ్చి అధికార పక్షాన్ని ప్రశ్నించాలని తెలిపారు. ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి నీ పెద్దరికాన్ని కాపాడుకో అంటూ కెసిఆర్ గురించి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.