కాంగ్రెస్ కు రమ్యారావు రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. టిపిసిసి అధికార ప్రతినిధి రమ్యారావు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. రమ్యారావు కేసీఆర్ అన్న కూతురు. ఆమె కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ పై, ఆయన కుటుంబం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిత్యం విమర్శిస్తూ హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా ఆమె కేటిఆర్ తో చర్చలు జరిపారని తెలుస్తోంది. దీంతో మరో రెండు రోజుల్లో ఆమె అధికారికంగా గులాబీ కండువా కప్పుకోనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.