వెలిమినేడులో మళ్లీ పంజా విసురుతున్న కాలుష్యం (వీడియో)

వెలిమినేడులో కాలుష్యం పంజా విసురుతుంది. గతంలో ఇదే గ్రామంలో కాలుష్య కంపెనీలకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచిన కొంత మంది ఒత్తాసు పలకడం వల్ల కంపెనీలకు అనుకూలంగానే పనులు జరిగాయని పలువురు యువకులు ఆరోపిస్తున్నారు. మంగళవారం సాయంత్రం వెలిమినేడు పరిధిలోని ఇండిస్ కంపెనీ నుంచి కాలుష్యం పొగలు కక్కుతూ గ్రామం వైపు వెళుతుంది. ఉదయం వేళల్లో అయితే ఇబ్బంది అవుతుందని సాయంత్రం నుంచి ఉదయం 4 గంటల వరకు ఈ పొగను విడుదల చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇలా కాలుష్యం విడుదల కావడం వల్ల ఓజోన్ పొర దెబ్బతిని దీని చుట్టు పక్కల ప్రాంతాలన్నింటిలో కూడా కలుషితపు వాయువులు ప్రసరిస్తాయి. తద్వారా మనుషులు దీనిని పీల్చడంతో గుండె, ఊపిరితిత్తుల రోగాలు వచ్చే అవకాశం ఉంది. నీరు కూడా కలుషితం అయ్యే అవకాశం ఉంది. 

 గ్రామస్థులు అనేక ఉద్యమాలు చేసిన కంపెనీలలో మాత్రం మార్పు రావడం లేదని వారంటున్నారు. ఇలానే జరిగితే మరో 5 ఏళ్లలో వెలిమినేడు మొత్తం నాశనమవుతుందన్నారు. కొంత మంది తమ స్వార్ధ రాజకీయాల కోసం కంపెనీలకు తొత్తులుగా మారారన్నారు. మరి దీనిని గ్రామంలో ఏర్పడిన నూతన పాలకవర్గం పరిష్కరిస్తుందో లేదో చూడాలి. రాజకీయాలను పక్కన పెట్టి సమస్య పరిష్కారానికి అంతా ముందుకు రావాలని వారు కోరుతున్నారు. 

ఇండిస్ కంపెనీ నుంచి విడుదలవుతున్న కాలుష్యం వీడియో కింద ఉంది చూడండి