టిఆర్ ఎస్ నేత, తాజా మాజీ ఎమ్మెల్యే పుట్టామధు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని బాధితుడు రమణా రెడ్డి డిజిపిని కలిసి తనకు రక్షణ కల్పించాలని కోరాడు. గుండా నాగరాజు ఆత్మహత్య కేసులో సాక్ష్యం చెప్పొద్దని పుట్టా మధు తనను బెదిరిస్తున్నాడని, తన అనుచరులతో చాలా సార్లు బెదిరించాడని బాధితుడు వాపోయాడు. ఆ కేసులోె ప్రధాన పాత్ర పుట్టా మధుది అని అతని పై చర్య తీసుకోని తనకు రక్షణ కల్పించాలని డిజిపికి రమణారెడ్డి ఫిర్యాదు చేశాడు.
అసలు వివరాలేంటంటే…
2013లో కేసీఆర్ సభ వద్ద పుట్టా మధుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుండా నాగరాజు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసులో సాక్ష్యం చెప్పొద్దంటూ పుట్ట మధు తన అనుచరులతో బెదిరించాడని, అతని నుంచి తనకు ప్రాణహాని ఉందని రమణా రెడ్డి డిజిపిని కలిసి ఫిర్యాదు చేశాడు. బాధితుడు మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి. లింక్ పై క్లిక్ చేస్తే వీడియో వస్తుంది.
దీనికి స్పందించిన డిజిపి మహేందర్ రెడ్డి… ఈ కేసును పునర్విచారణ చేయాలని రామగుండం కమీషనర్ ను ఆదేశించారు. నాగరాజు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్ట మధు రూ.50వేల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించాడని దానికి సంబంధించిన ఆధారాలన్నీ సాక్ష్యాలతో సహా డిజిపికి రమణా రెడ్డి అందజేశారు.
కాల్ డేటాతో సహా చనిపోయిన నాగరాజు స్టేట్ మెంట్ కాపీని డిజిపికి అందజేశాడు. నాగరాజు ఆత్మహత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నా పుట్ట మధును నిందితుడిగా చేర్చకుండా కనీసం నోటిసులు ఇవ్వకుండా పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారని బాధితుడు ఫిర్యాదులో పేర్కోన్నాడు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పై వెంటనే విచారణ చేపట్టి ఇందులో అతని పాత్ర ఎంత ఉందో తేల్చాలని డిజిపి ఆదేశించారు. నిష్పక్షపాత విచారణ చేసి పుట్టా మధు పాత్ర తేలితే న్యాయపరంగా విచారణ చేయాలని ఆదేశించారు.
2013 లో కేసీఆర్ సభకు హాజరయ్యారు. ఆ సభలో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని నినాదాలు చేస్తూ పురుగుల మందు డబ్బాను కేసీఆర్ ముందు తాగాలని ఆ తర్వాత వెంటనే తాను, ఇతరులమంతా కలిసి ఆసుపత్రికి తరలిస్తామని నీ ప్రాణాలకు ప్రమాదం ఉండదని నాగరాజుకు మధు పురమాయించాడు. రూ. 50 వేల రూపాయలు కూడా ఇచ్చాడు. దీంతో నాగరాజు పైసలు వస్తాయనే ఆశతో మధు చెప్పినట్టుగానే చేశాడు. కేసీఆర్ సభకు హాజరుకాగా నినాదాలు చేస్తూ పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత కార్యకర్తలంతా నాగరాజును ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నాగరాజు చనిపోయాడు.
పేదవాడైన నాగరాజును తన రాజకీయ స్వార్ధం కోసం ఆత్మహత్య చేసుకునేందుకు కారణం పుట్టా మధునేనని రమణారెడ్డి ఆరోపించారు. పుట్టా మధు పై గతంలో కూడా పుట్టా మధు పై చాలా ఆరోపణలొచ్చాయన్నారు.