టిఆర్ఎస్ పార్టీ జరపనున్న ప్రగతి నివేదన సభ కోసం కొంగర కలాన్ లో ఏర్పాట్లు భారీగా సాగుతున్నాయి. అయితే ఈ సభకు 25 లక్షల మంది జనాలు వస్తారని సర్కారు పెద్దలు చెబుతున్నారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు ఆకృతిని మార్చేశారు. ఎక్కడికక్కడ రోడ్డును తవ్వి పడేశారు.
సర్వీసు రోడ్లు, మెయిన్ రోడ్లను కలిపేశారు. ఔటర్ మీద శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసిన రక్షణ ఇనుప కంచెను తొలగించారు. తుక్కుగూడ, మహేశ్వరం, రావిర్యాల, కొంగర కలాన్, ఇబ్రహింపట్నం తదితర ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లను మెయిన్ రోడ్డుకు లింక్ కలిపి రోడ్లు వేశారు.
ఔటర్ మీద ఉన్న స్పీడ్ బ్రేకర్లను తొలగించారు. ఔటర్ రింగ్ రోడ్డును మొత్తానికి మొత్తం ఆకృతినే మార్చేశారు. ఇవన్నీ ఎలాంటి రాతపూర్వకమైన అధికారిక ఆదేశాలతో జరుగుతున్న పనులు కావని.. అన్నీ మౌఖిక ఆదేశాల మేరకే జరుగుతున్నాయని చెబుతున్నారు. రోడ్డు వేసే క్రమంలో అడ్డంగా ఉన్న చెట్లు, మొక్కలు కూడా పీకి పడేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో రోడ్లు ఎలా తవ్వుతన్నారో వీడియోల్లో చూడొచ్చు.