నాలుగున్నరేళ్ల పాటు దాదాపు ప్రభుత్వాన్ని ఉస్మానియా విద్యార్థులు బహిష్కరించారు. తెలంగాణ రాజధాని నడిబొడ్డున్న ఉన్న ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ముఖ్యమంత్రి కాలుమోప లేకపోయారు. ఆయన ఒకే ఒక సారి నాటి రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ వచ్చినపుడు వచ్చారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. మీడియా కథనాల ప్రకారం ఆయన మాట్లాడితే గొడవ చేసేందు విద్యార్థులు సిద్దంగా ఉన్నారని ఇంటెలిజన్స్ వర్గాలు హెచ్చరించాయట. అంతే, ఉద్యమాల పురిటి గడ్డ అయిన ఉస్మానియా ను ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. విద్యార్థులు ప్రభుత్వాన్ని బహిష్కరించారు. ఇపుడు ఈ విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగాపాట కట్టి ఎన్నికల్లో ప్రచారం చేయాలనుకుంటున్నారు.పల్లెల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులను ఒప్పించి టిఆర్ ఎస్ ను వోడించాలని పిలునిచ్చారు. ఈ క్యాంపెయిన్ కోసం ఒక పాట సిద్ధమయింది. ఇది ఈ పాటను యువతెలంగాణ పార్టీ విడుదల చేసింది. ఇదే ఆ పాట…