లగడపాటి సర్వేలొద్దు బాబోయ్, ఆయన నోరు మూయించండి

ఎన్నికల ముందు పెద్ద ఎన్నికల పండితుడిలాగా అవతారమెత్తి సర్వేఅంటూ తెగ సందడి చేస్తున్న  విజయవాడ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ మీద చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి కోరుతూ ఉంది.

సర్వే పేరుతో లగడపాటి తెలంగాణ ఎన్నికల ఫలితాలను  ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని, ప్రజలు  వాటిని వమ్ము చేశారనిచెబుతూ ఆయన  మీద చర్య తీసుకుని ఇలాంటి వి పునరావృతం కాకుండా చూడాలిన పార్టీ కోరింది.

తెలంగాణ ఎన్నికల ముందు  లగడపాటి రాజగోపాల్‌ చాలా సర్వే హంగామా సృష్టించారు. గతంలో ఒకటి రెండు సర్వేలు చేసి కొంతమేరకు మంచి ఫలితాలు చెప్పడంతో ఆయన సర్వేలకు తెగ పేరొచ్చింది. దీనితో ఆయన తెలంగాణలో రెచ్చిపోయారు. తానే చాలా పెద్ద పండితుడని చెప్పుకోవడం మొదలుపెట్టారు. దక్షిణాది నాడి నాకు తప్ప ఇతర సర్వే సంస్థలకు తెలియదని కూడా దబాయించారు.

‘ఇలా సర్వే పేర ఇష్టాను సారం ప్రకటనలు చేసి ఓటర్లను గందరగోళానికి గురిచేశారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అందువల్ల లగడపాటి రాజగోపాల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్‌ నాయకుడు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మెన్‌ సత్తువెంకటరమణారెడ్డి ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు.

మంగళవారం నాడు ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు ఎలాంటి సర్వే ఫలితాలు వెల్లడించవ్దదని ఎన్నికల కమిషన్‌ నింబధనలు ఉన్నప్పటికీ ఆయన ఉల్లంఘించారని, ఎనిమిది నుంచి పది మంది ఇండిపెండెంట్లు ఈ ఎన్నికల్లో గెలిచి ఫలితాలు తారుమారు చేయవోతున్నారని ఆయన చేసిన ప్రకటన ఓటర్లను ప్రలోభపెట్టడానికి మభ్యపెట్టడానికి దారి తీసిందని వెంకటరమణా రెడ్డి ఆరోపించారు.

ఆయన చెప్పిన మాటలు చాలా మంది అభ్యర్థుల భవితవ్యం మీద తీవ్ర ప్రభావం చూపిందని కూడా ఆయన తన ఫిర్యాదులో చెప్పారు. లగడ పాటి ప్రకటించిన సర్వే ముందస్తు ఫలితాలను కూడా ఆయనఫిర్యాదు లోఉదహరించారు.

డిపెంబర్ 7న పోలింగ్ జరగాల్సి ఉన్నపుడు 3వ తేదీన తిరుపతిలో తన సర్వే ఫలితాల ట్రెండ్ అంటూ బోధ్‌లో జాదవ్‌ అనిల్‌కుమార్‌, నారాయణపేట్‌లో శివకుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్‌లో జలంధర్‌రెడ్డి, బెల్లంపల్లిలో జి.వినోద్‌ గెలుస్తారని చెప్పారని ఆయన అన్నారు.
మరో మూడు స్థానాల్లో తన సన్నిహితులు గెలుస్తారని, ఆ ఫలితాలు వెల్లడించవద్దని కోరారని అందుకే వీటిని ప్రకటించడం లేదని చేసిన ప్రకటన దురుద్దేశంతోకూడుకున్నదనిపేర్కొన్నారు.

ఈ నెల 11న ఓట్ల లెక్కింపు తర్వాత లగడపాటి దబాయించినట్లు ఇండిపెండెంట్లలో ఓ ఒక్కరు గెలువలేదని ఆయన అన్నారు. లగడపాటి లీక్ ఒక విధంగా బ్లాక్‌ మెయిలింగ్‌ లాంటదని ఆయన వర్ణించారు. సర్వే పేరిట రాజగోపాల్ నడిపిన డ్రామా వెనక కుట్ర ఉందని, ఇలాంటి మరిమరి జరగకుండా ఉండాలంటే లగడపాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.