తెలంగాణలో జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1392 జూనియర్ లెక్చరర్ పోస్ట్ ఎక్కువ అర్హులైన వారందరూ కూడా అప్లై చేసుకోవలసినదిగా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడంతో అర్హులైన వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులందరూ ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 16 నుంచి ప్రారంభమవుతాయి. డిసెంబర్ 16 నుండి 2023 జనవరి 6వ తేదీ వరకు అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ తెలియజేసింది. 2023 జూన్ లేదా జూలై నెలలో ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ అధికారికంగా ప్రకటించింది.
పోస్టుల భర్తీకి సబ్జెక్టుల వారీగా ఉన్న ఖాళీల వివరాలు:
• అరబిక్ పోస్టులు: 2
• బోటనీ పోస్టులు: 113
• బోటనీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 15
• కెమిస్ట్రీ పోస్టులు: 113
• కెమిస్ట్రీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 19
• సివిక్స్ పోస్టులు: 56
• సివిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 1
• సివిక్స్ (మరాఠీ) పోస్టులు: 1
• కామర్స్ పోస్టులు: 50
• కామర్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 7
• ఎకనామిక్స్ పోస్టులు: 81
• ఎకనామిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 15
• ఇంగ్లిష్ పోస్టులు: 153
• ఫ్రెంచ్ పోస్టులు: 2
• హిందీ పోస్టులు: 117
• హిస్టరీ పోస్టులు: 77
• హిస్టరీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 17
• హిస్టరీ (మరాఠీ) పోస్టులు: 1
• మ్యాథమెటిక్స్ పోస్టులు: 154
• మ్యాథమెటిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 9
• ఫిజిక్స్ పోస్టులు: 112
• ఫిజిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 18
• సంస్కృతం పోస్టులు: 10
• తెలుగు పోస్టులు: 60
• ఉర్దూ పోస్టులు: 28
• జువాలజీ పోస్టులు: 128
• జువాలజీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 18
ప్రస్తుతం ఉన్న ఖాళీలలో అత్యధికంగా మ్యాథమెటిక్స్ కి 154 పోస్టులు ఖాళీగా ఉండగా.. ఇంగ్లీష్ పోస్టులు 153 ఖాళీగా ఉన్నాయి. జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో అర్హులైన అభ్యర్థులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.