చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద ఎపుడో బుక్ అయిన పాతకేసును దుమ్ముదులిపి మహారాష్ట్ర కోర్టొకటి ఈ రోజు ఆయనకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. 

కేసేమిటో తెలుసా?

2010 సంవత్సరంలో మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి మీద నిర్మిస్తున్న బాబ్లి ప్రాజక్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ధర్నాచేయడం.

బాబ్లి ప్రాజక్టు కడితే ఉత్తర తెలంగాణ  అవుతుందని ఆ రోజు విపరీతంగా తెలంగాణ నేతలు గొడవ చేశారు. చివరకు ఉమ్మడి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అపుడు ఆందోళన చేపట్టారు. నిజానికి ఈ ప్రాజక్టు గురించి ఏమాత్రం పట్టించుకోనిది తెలంగాణ రాష్ట్ర సమితియే. ఈ ధర్నాకోసం ప్రాజక్టు దగ్గిర ఉన్న నిషేధాజ్ఞలను తెలుగుదేశం నేతలు ఉల్లంఘించారనేది కేసు. అపుడు 14 మంది మీద కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి ఇపుడు ఒక్కసారి గా ఏకంగా నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమయింది.

ఈ రోజు తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా చంద్రబాబు తిరుమలలో ఉన్నపుడు ఈ వారంట్ జారీ అయింది. కేసులో ఉన్న పద్నాలుగు మందిని సెప్టెంబర్ 21 న కోర్టులో హాజరుపర్చాలని ధర్మాబాద్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ చంద్రబాబు ను ఇరుకున పెట్టే చర్యగా భావించడం కష్టం. ఎందుకంటే, ఇది ఉత్తర తెలంగాణ జిల్లాలకు గోదావరి జలాలు అందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కడుతున్న బాబ్లి ప్రాజక్టుకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం. ఇది తెలంగాణ హితం కోరి చేసిన ఉద్యమం. ఈ ఉద్య మంలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలే పాల్గొన్నారు.

వీరందరు తెలంగాణ సరిహద్దులు దాటి మహారాష్ట్రలో ప్రవేశించగానే పోలీసులు అడ్డగించారు. తెలుగుదేశం సభ్యలు పోలీసులను ఖాతరు చేయలేదు. ముందుకు ప్రాజక్టు దగ్గరకు పోయేందుకు ప్రయత్నించారు. చివరకు పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. చంద్రబాబు తోసహా అందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులు బుక్ చేశారు. చంద్రబాబు అపుడు బెయిల్ తీసుకోలేదు. తెలంగాణ కోసం తానిలా జైలులోనే ఉంటానని భీష్మించారు. చివరకు మహారాష్ట ప్రభుత్వం చంద్రబాబు ను బలవంంతంగా విమానంలో హైదరాబాద్ పంపారు.

బాబ్లి ప్రాజక్టు ముట్టడికి అప్పటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు, టిడిపి నేతలు ప్రయత్నిస్తారని తెలిసి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజక్టు దగ్గిర నిషేధాజ్ఞలు విధించింది. ఈ ఆజ్ఞల ఉల్లంఘనకు  సంబంధించినదే ఇప్పటి నాన్ బెయిలబుల్ వారంట్. చంద్రబాబు నాయుడు కోర్టు కు హాజరు కాకవపోవడాన్ని ప్రశిస్తూ ఒకవ్యక్తి వేసిని పిటిషన్ మీద ఈ వారంట్ జారీ అయింది.


బాబ్లి ప్రాజక్టు కు వ్యతిరేకంగా, తెలంగాణ కోసం చంద్రబాబు పోరాటం చేసిన విషయాన్ని ఈ వారంట్ఇపుడు తెలంగాణ ప్రజలకు గుర్తు చేసింది.

ఇది చంద్రబాబుకు ఏ మాత్రం అవమానకరమయినదికాదు, ఆయన్ను ఇబ్బంది పెట్టేది కూడా కాదు. అంతేకాదు, ఇది ఆయనను తెలంగాణలో హీరోని చేసే అవకాశం ఉంది. తెలంగాణలో నిలదొక్కుకునేందుకు టిడిపి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటన్నపుడు ఈ అరెస్టు వారంటు రావడంతో పార్టీ నాయకులు లోలోలన సంతోషిస్తున్నారు. దీనిని తెలంగాణలో ప్రచారానికి ఆయుధంగా వాడుకుంటామని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ పార్టీనయితే ఆంధ్రా పార్టీ అని బ్రాండే వేసి తరిమేయాలనుకుంటున్నాడో ఆ పార్టీ నేతతెలంగాణ కోసం అరెస్టయినట్లు ఇపుడు ఎన్నికల ముందు ఈ నాన్ బెయిలబుల్ వారంట్ గుర్తు చేసింది.

నిజానికి 2010లో బాబ్లి గురించి మాట్లాడని నాయకుడు కెసిఆరే. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుకు లాభించే చర్య ఈ అరెస్టు వారంట్.తెలంగాణ తెలుగుదేశం ఇపుడు తమనేత తెలంగాణ కోసం ఎలా ‘జైలు’ పాలయింది చెప్పుకోవచ్చు.

మహారాష్ట్ర బిజెపి ప్రభుత్వం చంద్రబాబుకు మేలు చేయాలనుకుంటున్నదా?

 

ఇది కూడా చదవండి

వారెంట్ మోదీ కుట్ర