మళ్ళీ తన తెలివి చూపించిన బాబు

 

బాబ్లీ కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్ 21 న కోర్టుకు హాజరు కావాలంటూ ధర్మాబాద్ న్యాయస్థానం చంద్రబాబుకు నోటీసులు పంపింది. సెప్టెంబర్ 24 న న్యూయార్క్ లో జరగనున్న ఐక్యరాజ్యసమితి కార్యక్రమానికి ఏపీ సీఎంకు ఆహ్వానం అందింది.

ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కావాలనుకున్న బాబు కోర్టుకు తన తరపు న్యాయవాదిని పంపించడానికి నిర్ణయం తీసుకున్నాడట. ఈ మేరకు చంద్రబాబు తరపున న్యాయవాదులు వెళ్లి నాన్ బెయిలబుల్ పై రీకాల్ పిటిషన్ దాఖలు చేయనున్నారట.

ఎనిమిదేళ్ల క్రితం బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు, మరి కొందరు టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులు వీరిని అడ్డుకుని కేసులు నమోదు చేసారు. దీనిపై విచారణకు కోర్టుకు హాజరు కావాల్సిందిగా ధర్మాబాద్ న్యాయస్థానం పలుమార్లు నోటీసులు పంపింది.

కానీ చంద్రబాబు వాయిదాలకు హాజరు కాకపోవటంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ చేసింది. అయితే ఇదంతా బీజేపీ కుట్రగా టీడీపీ ప్రచారం చేసుకుంది. తమ నాయకుడికి ఐక్యరాజ్య సమితిలో పాల్గొనే అరుదైన అవకాశం దక్కడంతో ఓర్వలేక మోడీ కుట్ర చేస్తున్నట్టు ఆరోపించింది.

తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఉత్తర తెలంగాణ కోసమే పోరాటం చేశాము అంటూ సీఎం అండ్ కో తెలంగాణ ప్రజల్లో సింపతీ గెయిన్ చేసే ప్రయత్నం చేసింది. బీజేపీ కుట్రగా అభివర్ణించింది. అయితే టీడీపీ ఆరోపణలను ఖండించారు బీజేపీ నేతలు. ఇటు వైసీపీ అధినేత జగన్ సైతం బాబు దొంగ సింపతీ కోసం ట్రై చేస్తున్నారంటూ విమర్శలు చేసారు కూడా.

అయితే చంద్రబాబుపై రాజకీయ వర్గాల్లో ఎన్ని కేసులున్నా స్టేలు తెచ్చుకోవడం బాబుకి అలవాటే అంటూ వార్తలు వినిపిస్తుంటాయి. ఇప్పుడు బాబ్లీ కేసులో కూడా వాయిదాలకు హాజరు కాలేదు చంద్రబాబు. నాన్ బెయిలబుల్ వారెంటును కూడా సీరియస్ గా తీసుకోలేదు. ఎప్పటిలానే ఈసారి కూడా కోర్టుకు హాజరు కాకుండా న్యాయవాదుల్ని కోర్టుకి పంపి, న్యూయార్క్ వెళుతున్నాడు. కేవలం ప్రచారం కోసమే బాబ్లీ నోటీసులను బాబు వాడుకున్నాడు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వాదన.