Revanth Reddy: కేసీఆర్‌ ఫ్యామిలీకి కాంగ్రెస్‌లో చోటు లేదు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో.. బీజేపీ, బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులెవ్వరూ కాంగ్రెస్‌లోకి రానిచ్చే అవకాశమే లేదని ఆయన అన్నారు.. తాను అధికారంలో ఉన్నంతవరకు వారిని పార్టీలో అడుగు పెట్టనివ్వనని స్పష్టం చేశారు.

ఇక కవిత MLCగా కేసీఆర్‌కు లేఖ రాసినట్టుగా తెరపై కనిపించిన వ్యవహారం అంతా డ్రామా అని విమర్శించారు. ఇది అసెంబ్లీ రౌడీ సినిమా స్క్రిప్ట్‌ లా ఉన్న డ్రామా అని కొట్టిపారేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ తంతు. అసలే అవినీతి ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో, చర్చను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేసిన చేశారని ఆరోపించారు.

కేసీఆర్ కుటుంబ సభ్యులపై తన వైఖరి మారబోదని రేవంత్ స్పష్టం చేశారు. వాళ్లంతా కొరివి దయ్యాల్లా రాష్ట్రాన్ని చుట్టేసారని.. గతంలోనూ ఇదే అన్నాను, ఇప్పటికీ అలాగే అంటున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల దోచుకొని.. అభివృద్ధికి అడ్డు పడుతున్నారని మండిపడ్డారు. ఇక తెలంగాణకు కేంద్రం నుండి రావాల్సిన అభివృద్ధి పథకాల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాన అడ్డంకిగా మారారని విమర్శించారు. ఒక్క రోజైనా ఆయన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారా అని ప్రశ్నించారు. రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు వంటి కీలక పనులను ఆయనే తేడా చేస్తూ వాయిదా వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చెప్పినట్టు కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.