కేసీఆర్ సర్కార్ కు కొత్త కష్టం.. ఆ సమస్యను ఎలా అధిగమిస్తుందో?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలలో ప్రజల్లో ఎక్కువగా గుర్తింపును సంపాదించుకున్న పథకంగా రైతుబంధు పథకానికి పేరుంది. ఈ పథకం వల్ల రైతులకు పెట్టుబడుల విషయంలో ఇబ్బందులు ఎదురు కావడం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పొలాలపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది.

అయితే ఈ స్కీమ్ అమలు కోసం భారీ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ సర్కార్ ఈ స్కీమ్ కోసం నిధులను ఏ విధంగా కేటాయిస్తుందో అనే చర్చ జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ సర్కార్ కు ఎలాంటి సహాయసహకారాలు అందించకూడదని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ అమలు కోసం 7600 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంది.

నిదుల కొరత సమస్యను సీఎం కేసీఆర్ ఏ విధంగా అధిగమిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు ఎక్కువ మొత్తం పొలాలు ఉన్నవాళ్లకు కూడా రైతుబంధు నగదును జమ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధనికులకు రైతు బంధు స్కీమ్ ను అమలు చేయాల్సిన అవసరం ఏంటని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. ఈ విమర్శలపై కేసీఆర్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.

ఈ పథకం అమలు వల్ల ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని భావిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల మెప్పు పొందడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకూడదని కేసీఆర్ సర్కార్ ఫిక్స్ అయింది.