ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం తమకు శత్రువులైన పార్టీల శత్రువులను కూడా కలుపుకుంటూ ముందుకు వెళుతోంది. వాస్తవానికి కొన్ని నెలల క్రితం వరకు షర్మిల గురించి ఎవరూ పట్టించుకోలేదు. అయితే వైఎస్సార్టీపీ పార్టీ ద్వారా షర్మిల తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ప్రగతిభవన్ ను ముట్టడించడానికి వెళ్లిన షర్మిలపై అధికార పార్టీల నేతలు దాడులకు పాల్పడటం హాట్ టాపిక్ అయింది.
అయితే షర్మిలకు మోదీ ఫోన్ చేశారని ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. మోదీ షర్మిలతో పది నిమిషాల పాటు మాట్లాడారని వేర్వేరు అంశాల గురించి చర్చించారని సమాచారం అందుతోంది. షర్మిలకు మోదీ సపోర్ట్ లభించడం అంటే కేసీఆర్ కు మరో షాక్ తప్పదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మోదీతో స్నేహం వల్లే జగన్ కేసీఆర్ మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో కేసీఆర్ పార్టీ అధికారంలో ఉండటం మోదీకి ఏ మాత్రం ఇష్టం లేదు. ఈ రీజన్ వల్లే కేసీఆర్ శత్రువులతో చేయి కలిపే దిశగా మోదీ అడుగులు వేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. షర్మిల నోరు విప్పితే మాత్రమే ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కేసీఆర్ కు వ్యతిరేకంగా జరుగుతున్నాయి.
షర్మిలకు అండగా ఉంటామని మోదీ చెప్పినట్టు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు షర్మిల పాదయాత్రను వాయిదా వేసుకున్నారని సమాచారం అందుతోంది. షర్మిలకు పొలిటికల్ గా మైలేజ్ అంతకంతకూ పెరుగుతోంది.