దేశంలోనే అత్యంత ఖరీదైన ఉపఎన్నిక అయిన మునుగోడులో ఏ పార్టీ గెలుస్తుందో అనే చర్చ జోరుగా జరుగుతోంది. మునుగోడులో గెలుపును డిసైడ్ చేసేది తటస్థ ఓటర్లే అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కోసం అన్ని పార్టీలు బయటి వ్యక్తులతో సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ సర్వేలలో చాలామంది తాము ఏ పార్టీకి అనుకూలమో చెప్పడానికి ఇష్టపడుతుండగా మరి కొందరు మాత్రం తటస్థంగా ఉన్నారు.
మరోవైపు మునుగోడులో గెలుపు విషయంలో పోటీ చేస్తున్న నేతలకు టెన్షన్ పెరుగుతోంది. అంచనాలకు అందని స్థాయిలో ఖర్చు చేస్తుండటంతో గెలవకపోతే పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతుండటం గమనార్హం. గ్రామీణ ప్రాంతాలలో తటస్థ ఓటర్ల సంఖ్య తక్కువగానే ఉన్నా పట్టణ ప్రాంతాలలో మాత్రం తటస్థ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. తటస్థ ఓటర్లు గెలుపును డిసైడ్ చేయనున్నారని తెలుస్తోంది.
ఏ పార్టీ గెలుస్తుందో అంచనా వేయడం సర్వే బృందాలకు సైతం ఒకింత కష్టమవుతోంది. అయితే మునుగోడు ఉపఎన్నికలో గెలుపుకు సంబంధించి బెట్టింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. కొంతమంది సొంతంగా సర్వేలు నిర్వహించి ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వెలువడే అవకాశం ఉందో వెల్లడయ్యే అవకాశం అయితే ఉంది. మునుగోడు ఉపఎన్నిక ఫలితాలపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతున్నాయి.
మరోవైపు మునుగోడు ఉపఎన్నికలో గెలిపిస్తే పార్టీ నేతలు గ్రామాలను కూడా దత్తత తీసుకుంటామని చెబుతున్నారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేతలు హామీలను ఎంతమేర నిలబెట్టుకుంటారో చూడాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కష్టమని ఇప్పటికే ఫిక్స్ అయింది. 2024 ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.