కేటిఆర్ కు వీర తిలకం దిద్దిన ఎంపి కవిత (వీడియో)

గులాబీ పార్టీ టిఆర్ఎస్ లో నెంబర్ 2 హోదాలోకి చేరుకున్న కేటిఆర్ సోమవారం పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నుంచి ర్యాలీగా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తన ఛాంబర్ కు వెళ్లి బాధ్యతలు చేప్టటారు.

అంతకుముందు బాధ్యతలు చేపట్టేందుకు బయలుదేరుతున్న కేటిఆర్ కు తన సోదరి, నిజామాబాద్ ఎంపి కవిత వీరతిలకం దిద్దారు. బొట్టు పెట్టి మంగళహారతులతో సాగనంపారు. కేటిఆర్ కు ఆయన సతీమణి శైలిమ కు బొట్టు పెట్టారు కవిత. అలాగే కేటిఆర్ తల్లి శోభ కు కూడా బొట్టు పెట్టారు. అనంతరం వారందరూ కలిసి కేటిఆర్ కు అభినందనలు తెలిపి ఇంటినుంచి సాగనంపారు.

కేటిఆర్ కు కవిత మంగళహారతి పట్టిన వీడియో కింద ఉంది చూడొచ్చు.