హరీష్ రావు దత్తత గ్రామానికి 60 మంది ఎమ్మెల్యేలు

తెలంగాణ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్ కు 60 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం గురువారం పర్యటించనున్నారు. వీరే కాదు మరో 25 మంది ఐఎఎస్ అధికారులు కూడా. ఇంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఎందుకు పోతున్నారు? వీరంతా ఎక్కడి వారు అనుకుంటున్నారా? అయితే చదవండి.

సిద్దిపేట జిల్లా సిద్ధిపేట మండలంలోని మంత్రి హరీష్ రావు దత్తత గ్రామం, ఆదర్శ గ్రామం అయిన ఇబ్రహీంపూర్ కు వివిద రాష్ట్రాలకు చెందిన 60మంది ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, 25 మంది ఐఏఎస్ లు రానున్నారు. దేశంలోనే ఆదర్శ గ్రామం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఇబ్రహీంపూర్ లో ఇంకుడు గుంతలు, egs లో దాదాపు 26 పనులు అమలు చేయడంలో, ఒకే గ్రామములో 2లక్షల మొక్కలు నాటిన గ్రామం ఇలా అన్నింటిలో ఆదర్శ గ్రామంగా నిలిచింది. ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చూడాటానికి వారు వస్తున్నారు. ఈ గ్రామాన్ని మోడల్ గా తీసుకొని వారి వారి నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని వారు విజిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రాష్టాలు,దేశాల నుండి ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది.

ప్రభుత్వం ఏర్పాటు కావడం..సిద్దిపేట అభివృద్ధి కి మరో దిక్సూచి

రెండవ సారి టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సిద్ధిపేట జిల్లా సర్వతోముఖాభివృద్ధి కి ఆస్కారం ఏర్పడిందని గ్రామస్తులు తెలిపారు. మరో సారి సిద్దిపేటకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఖాయమని అంటున్నారు.  అత్యధిక మెజారిటీ సాధించిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దత్తత గ్రామాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిథులు, అధికారులు రానుండడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు.

వివిధ రాష్ట్రాల నుండి ఇబ్రహీంపూర్ గ్రామానికి వస్తున్న ఎమ్మెల్యే లకు, ఎమ్మెల్సీలకు, ఐఎఎస్ లను స్వాగతం పలికేందుకు సిద్దిపేట ఎమ్మెల్యేగా హరీష్ రావు గురువారం ఉదయం 10 గంటలకే గ్రామానికి చేరుకోనున్నారు..ఎమ్మెల్యే లు వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కు, డిపివో కి ఆదేశించారు హరీష్ రావు.