టిఆర్ఎస్ డిఎస్ పై మధుయాష్కీ కొత్త బాంబు

ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత టిఆర్ఎస్ ఎంపి డి.శ్రీనివాస్ పై కాంగ్రెస్ మాజీ ఎంపి మధు యాష్కీ గౌడ్ సంచలన ఆరోపణలు గుప్పించారు. హైదరాబాద్ లో బుధవారం మధు యాష్కీ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఆయన ఏం మాట్లాడారో కింద చదవండి.
డీఎస్ కాంగ్రెస్ లోకి వస్తున్నారనడం అవాస్తవం.
డీఎస్ ప్రణబ్ ముఖర్జి, సోనియా లను కలిసిందన్నది కూడా తప్పుడు వార్త.

డీఎస్ బిజేపి లోకీ వెళుతున్నట్లు నాకు సమాచారం ఉంది.

నిజామాబాద్ లో అరవింద్ -కవిత ఇద్దరు పాలిటిక్స్ లో డూప్ గేమ్ అడుతున్నారు.
నేను నిజామాబాద్ ఎంపీగా నే పోటీచేస్తా.
కేసీఆర్ కు జాతీయ స్థాయిలో క్రెడిబిలిటీ జీరో.
అవసరం మేరకే తప్పా కెసిఆర్ ను బీజేపీ నమ్మడం లేదు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంలో మార్పు లు ఉంటాయని నాకు తెలియదు.
సీనియర్స్ సేవలను పార్టీ ఖచ్చితంగా గౌరవిస్తూనే యువతకు ప్రాధాన్యత ఇస్తామని రాహుల్ గాంధీ అన్నారుగా.
డెబ్భై ఏళ్లు దాటినా వారిని పక్కన బెడతారనడం తప్పు.
ఎవరితో పొత్తులుంటాయి, సీఎం అభ్యర్థి ఎవరు అనేది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది.
ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది.