ఆ పదవికి ఆయన రాజీనామా చేయడు, ఈయనకు పదవీ దక్కదు.. కీ అంతా కేసీఆర్ దగ్గరే ఉందట.. ?

 

ఎన్నో అనుకుంటాం కానీ అన్ని నెరవేరుతాయా ఏంటీ అని అనుకోక తప్పదట ఈ విషయం మొత్తం తెలిసాక.. అసలేం జరిగిందంటే మిస్టర్ కూల్ నేతగా పేరు పొందిన ఇందూరు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు రాజకీయ జీవితం ప్రశ్నార్ధకంగా మారిందట.. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఓ వెలుగు వెలిగిన వెంకటేశ్వరరావు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా నాలుగు దశాబ్దాలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత పేరు గడించారు.. అంతే కాకుండా ఎన్టీఆర్, చంద్రబాబుకు కుడిభుజంగా పేరు తెచ్చుకున్నారు.. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణాలో టీడీపీ మాయం అయ్యింది.. కాదు కేసీయార్ మాయం చేశారట..

ఇక నిజామాబాద్ జిల్లాలోను పెద్ద నాయకునిగా గుర్తింపు పొందిన ఈయనను కేసీఆర్‌ స్వయంగా కలిసి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌లో చేరిన మండవకు ఇప్పటి వరకూ ఎలాంటి పదవి దక్కలేదు. కానీ పార్టీలో మాత్రం నిజామాబాద్ జిల్లా నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డీఎస్‌ రాజీనామా చేస్తే.. ఆ పదవిని మండవకు కట్టబెడతారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇక గులాభికి అంటనట్లుగా ఉంటున్న డి.శ్రీనివాస్ కు టీఆర్ఎస్‌ పార్టీ వద్దు కానీ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వం కావాలన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.. అయినా పార్టీ కూడా ఆయనను సస్పెండ్‌ చేయడం లేదు. ఆయన ఆపదవికి రాజీనామా చేయడు ఈయనకు పదవి దక్కదు అని మండవ అనుచరులు పదే పదే అంటూ అసలు కీ అంతా కేసీయార్ చేతిలో ఉండగా మీకు ఇంకెప్పుడు పార్టీలో గుర్తింపు వస్తుందని అంటున్నారట..

అంతే కాకుండా పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తిలో ఉన్న మండవను పార్టీ మారాలంటూ కేడర్‌ కూడా ఒత్తిడి చేస్తూ, కారు దిగి కమలం నీడలోకి వెళ్తే బాగుంటుందనే సలహాలు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపధ్యంలో స్వయంగా ఇంటికి వెళ్లి మండవ వెంకటేశ్వరరావు ను టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన కేసీయార్ తీరా పదవి దగ్గరికి వచ్చేసరికి ఇలా మిన్నకుండిపోవడం మండవ అనుచరగణంలో చర్చగా మారిందట.. మరి ఈ గులాభి బాస్ ఆయన విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి..