ఎగ్జిట్ పోల్స్ మీద కమ్యూనిస్టోళ్ల స్టాండేమిటంటే…

 కమ్యూనిస్టోళ్ల మధ్య విబేధాలు చిత్రంగా ఉంటయ్. తెలంగాణలో సిపిఎం ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించింది. సిపిఐ జై కొట్టింది.

వాళ్ల మధ్య  చాలా విషయాల్లో రాజీలేని పోరాటముంటుంది. ఒక ఇష్యూ పై స్టేజీ మీద కలుస్తారు. ఇంక ఇష్యూమీద స్టేజీ దిగ్గానే విడిపోతారు.  పేర్లలో ఈ రెండుపార్టీలకు వుండే తేడా మాత్రం ఒక్కటే అక్షరం. (సిపిఐ, సిపిఎం). కాని వాళ్ల ఆచరణలో చాలా తేడా ఉంటుంది

నిన్నలి ఎగ్జిట్ పోల్స్ లో ఈ తేడా బాగా కనిపించింది. దీనిని మీద సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒకటంటే సిపిఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మరొకటన్నారు.

ముందు వీరభద్రం ఏమన్నారో చూడండి:   

#ఏక్సిట్ పోల్స్ లో ఒచ్చిన సర్వేలు చూస్తుంటే రిజల్టు టి ఆర్ ఎస్ కే  అనుకూలంగా ఉండే ఆవకాశం ఉంది.

#సీపీఎం ఆ సర్వేలను అదే విధగా చూస్తుంది.

#పోలింగ్ ప్రారంభం లో కొంత గందరగోళం ఉన్న సాయంత్రం వరకు పరిస్థితులు మారాయి.

#ఈ ఎలక్షన్స్ లో డబ్బులు , మద్యం ఏరులై పారింది.

#టి ఆర్ ఎస్ , మహా కూటమి లో ఎవరూ అధికారంలోకి వచ్చిన పెద్దగా ఒరిగేది ఎం ఉండదు.

#లగడపాటి రాజగోపాల్ సర్వేలో ఆయనకే సరైన క్లారిటీ లేదు.

 
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి  ఒపినీయన్ మరొకలాగుంది. ఎగ్జిట్ పోల్స్ ని  వీరభద్రం చెప్పిందానికి పూర్తి భిన్నంగా సిపిఐ చూస్తున్నది. సిపిఐ ఏమనిందో చూడండి:

#ముందస్తు ఎన్నికలు గందరగోళం ను సృష్టించాయ్.

#ప్రభుత్వ వ్యతిరేకత మమ్ములను (కూటమి) గెలిపిస్తుంది.

#జాతీయ సంస్థ లకు గ్రౌండ్ లెవల్ పై అవగాహన ఉండదు.

#లగడపాటి ,విజయ క్రాంతి సర్వే లు దగ్గరగా అనిపించింది.

#సర్వేలు చెప్పేదే ఫైనల్ కాదు. 11 వ తేదీన తెలుస్తుంది.