ఎన్నికలు సమీపిస్తున్నవేళ తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తది? ఏ పార్టీ ప్రతిపక్షంలో కూసుంటది అన్న చర్చలు ఊపందుకున్నాయి. సర్వేలకు సైతం తెలంగాణ ఓటర్ల నాడి అంతుచిక్కడంలేదు. కొన్ని సర్వేలు కూటమిదే గెలుపు అని సూచిస్తున్నాయి. మరికొన్ని సర్వేలు టిఆర్ఎస్ కారు దూసుకుపోతుందని సూచిస్తున్నాయి. తాజాగా అందిన ఒక సర్వే సంచలన విషయాలను వెలువరించింది. కూటమిదే అధికారం అని చెబుతూనే కొత్త చర్చను లేవనెత్తింది. టిఆర్ఎస్ పార్టీలో ఎవరు సిఎం కావాలి అన్న ప్రశ్నకు జనాల నుంచి ఆసక్తికరమైన సమాధానం వచ్చింది. హరీష్ రావు పేరునే సూచించారు జనాలు. కేటిఆర్ రెండో స్థానంలో ఉన్నారు. ఈ సర్వేలో మిగతా పార్టీల సంగతి కూడా ఆసక్తికరంగా ఉంది. పూర్తి వివరాలు చదవండి.
తెలంగాణ ఎన్నికల వేళ ఒక………. సంస్థ తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేసింది. ప్రజా కూటమిదే అధికారం అని చెప్పింది. ఏ స్థానంలో ఎవరు గెలుస్తారో, ఎవరికి ఎంత శాతం ఓటింగ్ వస్తుందో లెక్కలతో సహా చెప్పింది. టిఆర్ఎస్ అధికారం కోల్పోతుందని స్పష్టం చేసింది. సారాన్ష్ డాటా సొల్యూషన్స్ (saaraansh data solutions) ఈ సంచలన సర్వే చేసి ఫలితం వెలువరించింది. నవంబరు 9 నుంచి నవంబరు 21 వరకు ఉన్న పరిస్థితులను ఈ సర్వే వెల్లడించింది.
ఈ సర్వే లో 1,50,000 మంది ఓటర్లను ఈ సర్వే టచ్ చేసింది. 119 నియోజకవర్గాల్లోని 16 వేల పోలింగ్ బూత్ లలో సర్వే ప్రతినిధులు సమాచారం సేకరించారు. ఈ సర్వేలో కులం, వయసు, జెండర్, మతం, విద్య, స్థానికత ఆధారంగా వివరాలను సేకరించారు. సర్వేలో వెల్లడైన అంశాల ప్రకారం టిఆర్ఎస్ కు 42 స్థానాలు వస్తున్నట్లు తేలింది. ప్రజా కూటమికి 66 స్థానాలు ఖాయమని వెల్లడించింది. అలాగే బిజెపి 5, ఎంఐఎం కు 6 సీట్లు వస్తాయని తేల్చింది. ఓటింగ్ పర్సెంటజీ వారీగా చూస్తే టిఆర్ఎస్ కు 40.29 శాతం ఓటింగ్ నమోదు కానుంది. ప్రజా కూటమికి 41.25 శాతం రానుంది. బిజెపి కి 10.28, ఇతరులకు 5.04 శాతం నమోదు కానుంది. నోటా కు 3.14 శాతం ఓటింగ్ ఉండబోతున్నట్లు తేల్చింది.
ముఖ్యమంత్రిగా ఎవరికి బాుగందనే ప్రశ్నకు
కేసిఆర్ కు 41.43,
ఉత్తమ్ కుమార్ రెడ్డికి 25.64
జానారెడ్డి 9.81
బిజెపి లక్ష్మణ్ 2.25
కిషన్ రెడ్డి 7.13
అసదుద్దీన్ ఓవైసి 1.52 ఓటింగ్ నమోదు కాగా అసలు కిటుకు ఇప్పుడు చూడండి.
పార్టీల వారీగా ఎవరు బెస్ట్ సూటబుల్ సిఎం అన్న ప్రశ్నకు సమాధానాలు ఆసక్తిని రేపాయి.
టిఆర్ఎస్ లో చూస్తే హరీష్ రావుకు 51.38 శాతం రాగా
కేటిఆర్ కు 21.45 మాత్రమే వచ్చింది. ఈ లెక్కను చూస్తే హరీష్ కు టిఆర్ఎస్ లో ఉన్న పాపులారిటీలో కేటిఆర్ కు సగం కూడా లేదని తేలిపోయింది.
ఇక కాంగ్రెస్ లో ఉత్తమ్ కు 47.75 శాతం రాగా జానారెడ్డికి 21.84 మాత్రమే వచ్చింది. బిజెపి కిషన్ రెడ్డికి 41.54 రాగా లక్ష్మణ్ కు 19.89 వచ్చింది.
జిల్లాల వారీగా చూస్తే…
నల్లగొండలో కూటమికి 11 సీట్లు రాబోతున్నట్లు తేల్చింది. తుంగతూర్తి నియోజకవర్గంలో మాత్రమే టిఆర్ఎస్ గెలుస్తున్నట్లు తేల్చింది.
ఈ సర్వే ప్రకారం టిఆర్ఎస్ లో ఉన్న హేమాహేమీలు సైతం మట్టి కరుస్తున్నట్లు తేలింది. బాన్స్ వాడలో పోటీ చేస్తున్న సీనియర్ నేత మంత్రి పోచారం ఓటమి తప్పదని తేల్చింది.
సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ఓటమి పాలైతున్నట్లు తేల్చింది.
ఆదిలాబాద్ లో మంత్రి జోగు రామన్న గెలుపొందే చాన్స్ ఉన్నట్లు చెబుతోంది. నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గెలుపొందే అవకాశం ఉన్నట్లు తేల్చింది.
నిజామాబాద్ లో గత ఎన్నికల్లో 9కి 9 సీట్లు గెలిచిన టిఆర్ఎస్ ఇప్పుడు రెండు సీట్లకే పరిమితం కానున్నట్లు తేల్చింది. సిరిసిల్లలో మంత్రి కేటిఆర్, హుజూరాబాద్ లో మంత్రి ఈటల గెలుస్తారని చెప్పింది.
సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు తెలంగాణలోనే హైయెస్ట్ ఓటింగ్ శాతం 71.33 తో గెలుస్తారని తేల్చింది. సిరిసిల్లలోనూ మంత్రి కేటిఆర్ 68.04 శాతం ఓటు షేర్ తో గెలుస్తారని చెప్పింది.
గజ్వేల్ లో కేసిఆర్ 65.04 తో గెలస్తారని, ప్రత్యర్థి కి 28.08 మాత్రమే సాధిస్తారని తేల్చింది.
తాండూరులో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఓటమిపాలైతున్నట్లు సర్వేలో వెల్లడించింది.
సనత్ నగర్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 50.20తో గెలుస్తాడని తేల్చింది.
సికింద్రాబాద్ లో మంత్రి పద్మారావు గౌడ్ గెలుపు ఖాయమని తేల్చింది.
కొడంగల్ లో రేవంత్ రెడ్డి 51.15 శాతంతో గెలుపు ఖాయమని తేల్చింది.
జడ్చర్లలో మంత్రి లక్ష్మారెడ్డి గెలుస్తడని తేల్చింది.
కల్వకుర్తిలో బిజెపి అభ్యర్థి టి.ఆచారి 36.16తో గెలుస్తాడని, టిఆర్ఎస్ రెండో స్థానంలో ఉంటుందని తేల్చింది.
హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి 53.43 శాతంతో గెలుస్తాడని తేల్చింది.
పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి అని చెప్పింది. ఇక్కడ కూటమికి 48.31 శాతం ఓటింగ్ రాగా ఎర్రబెల్లికి 40.32 మాత్రమే ఇచ్చింది.
భూపాలపల్లి లో స్పీకర్ మధుసూదనాచారి ఓటమి తప్పదని తేల్చింది. గండ్ర వెంకట రమణారెడ్డికి 44.21 శాతం ఓటింగ్ నమోదు అవుతుందని తేల్చింది.
పాలేరులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గెలుస్తాడని తేల్చింది.