ఎందయ్యో లగడపాటి ఎగిరిపడుతున్నవ్, ఏంది కథ

  (PK )
 

రాష్ట్ర విభజన తో రాజకీయాల్లో  ఓడిపోయి సర్వేలంటూ చిలుక జోస్యం చెప్పుకుంటున్న లగడపాటి రాజగోపాల్‌ తాజాగా చెప్పిన జోస్యం తెలుగు రాష్ట్రాల్లో  హాట్‌టాపిక్‌గా మారింది. 

 టీఆర్‌ఎస్, మహాకూటమిలో ఎవరికి మెజారిటీ వస్తుందో చెప్పకుండా స్వతంత్య్ర అభ్యర్థులు ఎనిమిది మంది గెలుస్తారని చెప్పి అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకున్నారు. మీడియా అటెన్షన్‌ను తన వైపునకు తిప్పుకోవడంలో మొదటి నుంచి ఆయనది అందె వేసిన చేయి. తనను జనం మరచిపోయారనుకున్నప్పుడల్లా సర్వే పేరుతో ఏదో ఒక లీకిచ్చి వార్తల్లోకి ఎక్కడం నాలుగేళ్లుగా తెలుగు ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతుండడంతో సర్వే పేరుతో ఇండిపెండెంట్లు ఎక్కువ మంది గెలుస్తున్నారని బాంబు పేల్చాడు. దీనర్థం హంగ్‌ వస్తుందని చెప్పడమేనంటున్నారు రాజకీయ పండితులు.

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 63 సీట్లు వచ్చాయి. ఈసారి ఏడెనిమిది అటూ, ఇటూగా వస్తాయని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అంటే 40 నుంచి 50 సీట్లు మహాకూటమికి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కనే చెబుతున్న లగడపాటి మిగిలిన సీట్లలో ఇండిపెండెంట్లు గెలిచే అవకాశాలున్నాయని లగడపాటి చెబుతున్నారు. ఎనిమిది మంది ఇండిపెండెంట్లు గెలుస్తున్నారని చెప్పడం ద్వారా త్వరలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో వారు కీలకం కాబోతున్నారని చెప్పినట్లు అర్థమవుతోంది.

  అయితే లగడపాటి చెప్పిన ఈ విషయం ఎవరికి అనుకూలం అనే చర్చ నడుస్తోంది. అసలు లగడపాటి ఈ విషయాన్ని తనకు తానుగా చెప్పారా, ఎవరైనా చెప్పించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌కు కొంతమేరకైనా లబ్ది చేకూర్చేందుకు ఆయన ఈ విషయాన్ని బయటపెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటె గెలుస్తారని ఆయన చెప్పిన ఇద్దరు ఇండిపెండెంట్లు కాంగ్రెస్‌ రెబల్స్‌ కావడమే. కాంగ్రెస్‌ రెబల్స్‌ ఎక్కువ మంది బరిలో ఉండడంతో కొన్నిచోట్ల వారి ప్రభావం గట్టిగానే ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ఇండిపెండెంట్లు గెలవబోతున్నారని, ప్రజలు వారికి ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పడం ద్వారా కాంగ్రెస్‌ రెబల్స్‌కు అనుకూలంగా లగడపాటి తన సర్వేను బయటపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

లగడపాటి సర్వే వెనక ఒక కుట్ర ఉందా? ఉంటే ఏమిటది?

లగడపాటి రాజగోపాల్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణా నుండి పోటీ చేస్తా అంటున్నాడు. మల్కాజ్ గిరి లేదా ఖమ్మం నుండి ఇదే ప్రజా కూటమి తరపున ఎంపీగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.తెలంగాణా వల్ల సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది.. కాబట్టి తెలంగాణాలో గెలిచి కక్ష తీర్చుకోవాలి అనుకుంటున్నాడు. తెలంగాణా లో పోటీ చేయాలి అంటే టీఆర్ఎస్ అధికారంలోకి రాకూడదు. అందుకే కాంగ్రెస్ రెబెల్స్ ఉంటే కాంగ్రెస్ లేదా కూటమి అభ్యర్థులకు నష్టం జరగాలి…కానీ టీఆర్ఎస్ కు నష్టం జరుగుతుందని లీకులు ఇస్తున్నాడు తెలంగాణా ద్రోహి లగడపాటి…దీనికి ఆంధ్రా మీడియా కథలు అల్లబోతున్నది…తస్మాత్ జాగ్రత్త తెలంగాణా ప్రజలారా. తెలంగాణ గడ్డ పైనే రాష్ట్ర విభజన కు కారణమైన కేసీఆర్ ను ఓడించాలని లగడపాటి కల. దానిని నిజం చేసుకునేందుకే ఇదంతా అని మరొక వాదన .మొత్తానికి లగడపాటి సర్వే చేశాడో లేదో గాన సర్వే పేరుతో అదరగొట్టాడు.